Pawan Kalyan: ఆ వార్త విని మనస్సు కలచివేసింది.. పవన్ ఎమోషనల్
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:03 PM
Pawan Kalyan: రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. అయితే ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
అమరావతి: రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. అయితే ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. యువకుల మృతి బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని చెప్పారు. గత ఏదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నామని అన్నారు.
ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని అన్నారు. ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తుండగా వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు విడిచారని చెప్పారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు అని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదన్నారు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని తెలిపారు.ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారని అన్నారు.
ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఆ వేడుకలో విజ్ఞప్తి చేశానని చెప్పారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
వ్యాన్ ఢీకొని యువకుల మృతి
కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) బైక్‌పై శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం వేమగిరిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి కాకినాడ బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు వడిశలేరులో ఎదురుగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టగా తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో ఇద్దరినీ వారి స్నేహితులు 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కొనఊపిరితో ఉన్న చరణ్‌ను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 12.15 గంటలకు మృతిచెందాడు. మృతుల స్నేహితుడు శశిశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ టి.కృష్ణసాయి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన
JC Prabhakar Reddy : ఆవేశంలో నోరుజారాను.. తప్పే!
Minister Nara Lokesh : వైసీపీ అక్రమాలపై త్వరలోనే యాక్షన్!
Read Latest AP News and Telugu News