AP NEWS: సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్ అనుచరుల హల్‌చల్.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:17 PM
Sunil Kumar followers: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ అనుచరులు రెచ్చిపోయారు. ఆయన ఫొటో ఉన్న కారుతో అనుచరులు ఆకివీడులో హల్‌చల్ చేశారు. ఆకివీడులో కోర్టు అనుమతులతో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు.

పశ్చిమగోదావరి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు అనుబంధంగా కొంతమంది అధికారులు పని చేశారు. కీలక నేతలు చెప్పిందల్లా చేసి అధికారులు అభాసుపాలయ్యారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీకి మద్దతుగా పని చేసిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై కొరడా ఝుళిపించింది. అయితే అతని అనుచరులు మాత్రం ఇంకా అడ్డు అదుపు లేకుండా మితిమీరిపోతున్నారు.
సంజయ్ కుమార్ అనుచరులు గురువారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫొటో ఉన్న కారుతో ఆయన అనుచరులు ఆకివీడులో హల్‌చల్ చేశారు. ఆకివీడులో కోర్టు అనుమతులతో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణదారులకు మద్దతుగా ఘర్షణ సృష్టించడానికి సునీల్ కుమార్ అంబేద్కర్ ఫొటోలతో పాటు పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో దుండగులు వచ్చారు. గుత్తికొండ జోగిరావు పేరుమీద ఉన్న ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. గుత్తికొండ జోగిరావు పీవీ సునీల్ కుమార్ అనుచరుడని సమాచారం. కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి ఆకివీడు పోలీసులు తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ నేత అరాచకం.. ఏకంగా కిడ్నాప్ చేసి.. ఏం చేశారంటే..
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత
ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
Read Latest AP News and Telugu News