Share News

Tuni Tension: తునిలో ఉద్రిక్తత.. రహస్య ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీ ఆగ్రహం

ABN , Publish Date - Feb 18 , 2025 | 11:20 AM

Tuni Tension: తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల రసాభాసగా మారింది. ఎన్నికలకు టీడీపీ కౌన్సిలర్లు ఇప్పటికే సమావేశానికి హాజరుకాగా.. వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రహస్య ప్రాంతాల్లో దాచేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tuni Tension: తునిలో ఉద్రిక్తత.. రహస్య ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీ ఆగ్రహం
Tuni Vice Chairaman Election

కాకినాడ, ఫిబ్రవరి 18: తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎన్నికలు జరుగకుండా చేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈరోజు (మంగళవారం) ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. ఎన్నిక జరగకుండా వైసీపీ చేస్తోందంటూ మండిపడుతున్నారు టీడీపీ కౌన్సిలర్లు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు నెట్టివేశారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక కోసం వెళ్లడానికి ప్రయత్నించగా.. టీడీపీ నేతలు పక్కనే ఉండడంతో మళ్లీ కౌన్సిలర్లను దాచేసింది వైసీపీ.


ఎన్నికకు టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ ఓటమి భయంతో వైసీపీ మాత్రం ఎన్నికకు రాకుండా రకరకాల డ్రామాలు ఆడుతున్న పరిస్థితి. తాము ఎన్నికకు సిద్ధంగా ఉంటే వైసీపీ తమ కౌన్సిలర్లను ఎందుకు నిర్బంధిస్తూ రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 10 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వెళ్లారు. అయితే వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకావాల్సి ఉంది. వారు వస్తే టీడీపీ వైపుకు మొగ్గు చూపుతారనే భయంతో వైసీపీ కౌన్సిలర్లను వైసీపీ చైర్మన్ నివాసంలో దాచేశారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలుకొడుతూ వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు.

Student Death: విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఉద్రిక్తం


మేము ఎన్నికకు సిద్ధమవుతుంటే ఎందుకు వైసీపీ కౌన్సిలర్లు పదే పదే దాస్తున్నారంటూ పోలీసులతో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లి ఎన్నికలకు హాజరుకావాలని కోరుతామని టీడీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. అయితే ఇరువర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు దాచిన ప్రాంతం నుంచి కొంతమంది కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాడానికి బయటకు రాగానే.. అది తెలుసుకున్న వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైస్ చైర్మన్ అంతా కలిసి వైసీపీ కౌన్సిలర్లను లాక్కెళ్లి వేరే చోట దాచేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ తీరుపై పోలీసులు కూడా మండిపడుతున్న పరిస్థితి.


ఇంత జరుగుతుండగా అధికారులు మాత్రం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని 12 గంటల వరకు వేచి చూసి కోరం లేని పక్షంలో వాయిదావేస్తామని చెబుతున్నారు. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్‌ ఎన్నికకు 28 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉంటుంది. కోరానికి కనీసం 14 మంది హాజరుకావాల్సి ఉండగా.. ఇప్పటికే టీడీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు సమావేశం లోపల ఉన్నారు. మరో నలుగురు కౌన్సిలర్లు హాజరైతే కోరం ప్రకారం ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. కానీ వైసీపీ మాత్రం తమ కౌన్సిలర్లను రానీయకుండా వారిని రహస్య ప్రాంతాల్లో దాచేసింది.


ముద్రగడను అడ్డుకున్న పోలీసులు..

మరోవైపు.. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఛలో తునికి వైసీపీ పిలుపునిచ్చింది. ఇందుకు సంఘీభావం తెలుపుతూ అక్కడకు చేరుకున్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభాన్ని తుని రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. నోటీసు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా.. నోటీసు తీసుకోకుండానే ముద్రగడ వెనక్కి వెళ్లిపోయారు. అలాగే ఛలో తునికి వచ్చిన వైసీపీ మాజీ ఎంపీ వంగా గీతను కూడా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గీత వెనక్కి వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి..

మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 18 , 2025 | 11:36 AM