Share News

Forest Dept : సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

ABN , Publish Date - Jan 08 , 2025 | 06:09 AM

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.

 Forest Dept :  సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

  • కలెక్టర్‌ ఆగ్రహం.. జేసీ నేతృత్వంలో సర్వే.. 52.40 ఎకరాలు ఆక్రమణ

కడప, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది. కడప నగర శివార్లలో సజ్జల కుటుంబానికి 160 ఎకరాలకుపైగా పట్టాభూములు ఉన్నాయి. ఇక్కడ రిజర్వు ఫారెస్టుకు చెందిన 52.40 ఎకరాల భూమిని సజ్జల కుటుంబం ఆక్రమించింది. ‘రిజర్వు ఫారెస్టులో సజ్జల సామ్రాజ్యం’ శీర్షికన ఈ విషయాన్ని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై విచారణ చేయాలంటూ అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కడప కలెక్టర్‌ శ్రీధర్‌ను ఆదేశించారు. అటవీశాఖ అఽధికారులు చేతులెత్తేయడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ అదితిసింగ్‌ పంపి మంగళవారం సర్వే చేయించారు. మొత్తానికి సజ్జల ఫ్యామిలీ సుమారు 52.40 ఎకరాలు ఆక్రమించిందని అధికార యంత్రాంగం నిర్ధారించింది. పూర్తి నివే దికను ప్రభుత్వానికి పంపనుంది.

Updated Date - Jan 08 , 2025 | 06:09 AM