Share News

AP Property Tax: ఆస్తిపన్ను చెల్లింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 28 , 2025 | 06:51 PM

AP Property Tax: ఆస్తి పన్నుచెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆస్తి పన్ను బకాయిలను త్వరగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP Property Tax: ఆస్తిపన్ను చెల్లింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Property Tax

అమరావతి: మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 30,31 తేదీల్లో కూడా పన్నుల చెల్లింపు కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది.


మార్చి 31 వరకే పన్ను చెల్లించేందుకు గడువు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కౌంటర్లు పనిచేయనున్నాయి. వరుసగా పండుగలు రావడంతో తగిన సిబ్బంది ఉండేలా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లోనూ పన్నులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Lokesh Congratulates Akhil: 11ఏళ్ల టెక్‌ పిడుగు అఖిల్‌కు మంత్రి లోకేష్ అభినందనలు

Vamsi Bail Petition: వరుస ఎదురుదెబ్బలతో వంశీ ఉక్కిరిబిక్కిరి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 07:07 PM