Share News

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:39 AM

Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి మృతిచెందింది. ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా 14 నెలల పాప తన్వి శ్రీ చనిపోయింది. వైద్య కోసం ఎయిమ్స్‌కు కాకినాడకు చెందిన కొంతం గంగరాజు, కుమారి దంపతుల పాప తన్వి శ్రీని తీసుకువచ్చారు. గత నెల రోజుల క్రితం ఆగి ఉన్న ద్విచక్ర వాహనం పైనుంచి చిన్నారి కిందపడింది. అయితే వైద్యచికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్‌కు నాలుగు రోజుల క్రితం తన్వి శ్రీని తీసుకువచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆందోళనతో ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన.. మహిళ జుట్టు కత్తిరించి..

Nandyala: మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం

Crime News: గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 16 , 2025 | 10:41 AM