Jana Sena: చెన్నైలో డీలిమిటేషన్ సమావేశంపై జనసేన క్లారిటీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:40 PM
Janasena party: తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో డీలిమిటేషన్‌పై ఇవాళ సమావేశం జరిగింది. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని జనసేనకు కూడా ఆహ్వానం పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అమరావతి: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై ఇవాళ(శనివారం) చెన్నైలో డీఎంకే పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం పంపించింది. అయితే ఈ భేటీకి హాజరుకాలేమని జనసేన ప్రతినిధులు సమాచారం అందజేశారు. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని ఆ పార్టీ అగ్ర నేతలు తేల్చిచెప్పారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై తమ విధానం తమకు ఉందని అన్నారు. ఈ విషయంపై తమ విధానాన్ని త్వరలో వెల్లడిస్తామని జనసేన అగ్రనేతలు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానంపై నేతల చర్చ..
తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. వీరంతా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి కలిగే నష్టాలపై చర్చించారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ విధానాలను నేతలు తప్పు పట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎలా కలిసి వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే
CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..
Jagan Sharmila On Delimitation: పునర్విభజనపై జగన్, షర్మిల ఏమన్నారంటే
Read Latest AP News And Telugu News