Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 10:01 PM
Pawan Kalyan: పులుల సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అమరావతి:వన్యప్రాణుల సంరక్షణకు ఏపీప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పులుల సంరక్షణ అంటే కేవలం పులుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని.. వన్యప్రాణులు, స్థానిక సమాజాలకు ప్రయోజనం చేకూర్చే సామరస్యపూర్వక పర్యావరణ వ్యవస్థను నిర్వహించడమని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) పులులపై వార్షిక నివేదికను విడుదల చేసి, నగరవనం లోగోను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా 50 నగరవనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 2024-25 సంవత్సరానికి మరో 11 నగరవనాలు మంజూరు చేయబడ్డాయని అన్నారు. పిఠాపురంలో ఒక నగరవనం కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర పచ్చదనాన్ని 50శాతానికి పెంచడానికి, పులుల కారిడార్లను బలోపేతం చేయడానికి, క్షీణించిన ఆవాసాలను పునరుద్ధరించడానికి, పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. వన్యప్రాణులను రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, క్షేత్ర సిబ్బంది, పరిరక్షకులు నిబద్ధతతో పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్ ఫైర్
Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే
CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..
Read Latest AP News And Telugu News