Share News

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:09 PM

Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ
YS Viveka Murder Case

కడప, ఫిబ్రవరి 21: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌లపై కృష్ణా రెడ్డి పెట్టిన కేసు తప్పుడు కేసని పులివెందుల పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు విచారణ తుది నివేదికను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్.. కోర్టుకు సమర్పించారు. 2023లో వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు సీబీఐ అధికారి రామ్ సింగ్‌లపై కృష్ణా రెడ్డి తప్పుడు కేసు పెట్టారు. విచారణ పేరుతో రామ్ సింగ్ తమను తీవ్రంగా కొడుతూ వేధిస్తున్నారని, సునీత రాజశేఖ‌ర్‌లు కూడా వారికి అనుకూలంగా చెప్పమని వేధిస్తున్నారని కోర్టులో తప్పుడు కేసు వేశారు కృష్ణారెడ్డి.


కోర్టు ఆదేశాల మేరకు నాలుగు నెలలుగా 23 మంది సాక్షులను పులివెందుల డీఎస్పీ విచారించారు. చివరకు సునీత రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రామ్ సింగ్ ముగ్గురిపై కృష్ణారెడ్డి పెట్టింది ఫాల్స్ కేసని పోలీసులు తేల్చేశారు. అలాగే తప్పుడు కేసు పెట్టిన కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.


వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఒత్తిళ్లకు తలొగ్గిన పీఏ కృష్ణారెడ్డి బాధితులపైనే కేసు పెట్టారు. వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు సీబీఐ అధికారి రామ్ సింగ్‌లపై అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు కృష్ణారెడ్డి. కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దీనిపై సునీత కోర్టులో పిటిషన్‌ వేశారు. కృష్ణారెడ్డి వేసింది తప్పుడు కేసని తెలిపారు. సునీత అభ్యర్థన మేరకు దీనిపై విచారణకు ఆదేశించింది కోర్టు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను విచారణ అధికారిగా నియమించారు. దీంతో గత నాలుగు నెలలుగా డీఎస్పీ దాదాపు 23 మంది సాక్షులను విచారించారు. చివరకు ఇదంతా తప్పుడు కేసని సాక్షుల ద్వారా తెలుసుకున్నారు డీఎస్పీ. వైసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి కృష్ణారెడ్డి తప్పుడు కేసు పెట్టారని సాక్షులు విచారణలో స్పష్టం చేశారు. దీంతో కేసు విచారణ తుది నివేదిక డీఎస్పీ కోర్టుకు సమర్పించారు. అంతే కాకుండా తప్పుడు కేసు పెట్టినందుకు గాను కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

తాజ్‌ బంజారా హోటల్‌‌కు షాక్

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 01:28 PM