Venkataramana Reddy: తెలంగాణలో జరిగేది అదే.. రాసిపెట్టుకోండి.. కామారెడ్డి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:22 PM
Venkataramana Reddy: తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా శిక్షకు అర్హులే అని తెలంగాణ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తేల్చిచెప్పారు. ఇందులో రాజకీయ కక్షలు లేవన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారనేది గ్రామాల్లోని ప్రజలు అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమగోదావరి, జనవరి 20: తెలంగాణలో రాజకీయాలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (Kamareddy MLA Venkataramana Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 45 రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. ఇది పక్కా.. రాసిపెట్టుకోండి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు భీమవరంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సేవా కార్యక్రమాల్లో తెలంగాణా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) తప్పొప్పులను కోర్టు నిరూపిస్తుందన్నారు. ఆయన క్వాష్ పిటీషన్ వేస్తే అది కొట్టేశారని.. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా శిక్షకు అర్హులే అని తేల్చిచెప్పారు. ఇందులో రాజకీయ కక్షలు లేవన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారనేది గ్రామాల్లోని ప్రజలు అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
అలాగే తెలంగాణ అధికారులు, నేతల విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్‌లు మొదలుకొని స్పీకర్ వరకూ అందరూ విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ఆ పర్యటన వల్ల వచ్చే లాభం ఎంతంటే.. పేపర్ మీద చూపించే తెలివి ఒక్కరికీ లేదని విమర్శించారు. ‘‘పర్యటన చేసోచ్చాక.. ఇన్ని కోట్ల ఖర్చు అయినాయి, దీనికి వెయ్యింతలు అవకాశాలు, ఇండస్ట్రీస్ వచ్చాయి, లాభాలు వచ్చాయని ఎదైనా ఇక్కడ చూపించారా’’ అని ప్రశ్నించారు. ఎవరైనా చూపిస్తారా.. ఆ దుమ్ము ధైర్యం ఉన్న వాడే విదేశీ ప్రయాణాలు చేయాలన్నారు. లేదా ఇంట్లో కూర్చుని ఇక్కడున్న యువతను ఎంకరేజ్ చేయాలని హితవుపలికారు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందనే ఆశతో ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించిందని... ఇంకా సహకరిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించారు.
Anitha: విశాఖలో హోంమంత్రి పర్యటన.. పీఎస్‌లో ఆకస్మిక తనిఖీలు
సేవా కార్యక్రమాలు...
కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భీమవరంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిభిరం ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్, ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మెమోరియల్ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. షుగర్ వ్యాధి వారికి పాదాలు పగుళ్ళు, పుండ్లు, గాయాలు, స్పర్శ కోల్పోవడంపై డాక్టర్లు ప్రత్యేకంగా చికిత్స అందజేస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ వేణు కవర్తపు పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు జరుగుతోంది. షుగర్ వ్యాధిగ్రస్తులు వేలాదిగా వచ్చి వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
అక్కడికి వెళ్లిన తెలుగు సీఎంలు.. విషయం ఇదే..
నాతో ఆడుకున్నాడు.. సచిన్ సంచలన వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News