Gannavaram Airport: మరోసారి గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:37 AM
Vijayawada: గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ల్యాండింగ్‌కు సిగ్నల్ అందక ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి.

విజయవాడ, ఫిబ్రవరి 6: గన్నవరం విమానాశ్రయంలో (Gannavaram Airport) మరోసారి విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. మొత్తం రెండు విమానాలు గాల్లోనే తిరుగుతున్నాయి. ఎయిర్‌పోర్టును దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చిన విమానాలు గాల్లోనే తిరుగుతున్నాయి. పొగ మంచు కారణంగా ల్యాండింగ్, టేకాప్‌కు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (Indigo) విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. పొగమంచుతో గన్నవరం చేరుకోవాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. కిందకు దిగేందుకు ఎయిర్‌వేస్ కనిపించకపోవడంతో గాల్లోనే విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు వ్యాపిస్తోంది. విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు సరైన మార్గం కనిపించకపోవడంతో పైలట్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. రన్‌వేపై పూర్తి స్థాయిలో మంచు కప్పేసింది. సిగ్నల్ సరిగ్గా కనిపించకపోవంతో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. విమానాలు ల్యాండింగ్ అవకుండా గాల్లోనే ఉండటంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దట్టమైన పొగమంచు ఇంకా అలాగే ఉన్నట్లైతే విమానాలను వెనక్కి పంపాలనే యోచనలో కూడా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు.
జాగ్రత్త.. ఈ యాప్ మీ మొత్తం సమాచారాన్ని లాగేస్తుంది..
అయితే కాసేపటి క్రితమే పొగమంచు క్లియర్ అవడంతో పైలెట్‌కు సిగ్నల్ అందడంతో రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం అవడం ఒక్కెత్తైతే పూర్తి స్థాయిలో రన్‌వేపై పొగమంచు కప్పేయడంతో కొద్దిసేపు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల కాలంలోనూ పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచిన విషయం తెలిసిందే. విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఆ తరువాత అంతా క్లియరెన్స్ వచ్చాక విమానాలు సేఫ్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవడంతో ప్రయాణికులు హమ్మయ్య అనుకున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
కుంభమేళాలో అపచారం.. ఓ జంట చేసిన పనికి..
Read Latest AP News And Telugu News