Share News

Payyavula Keshav: అన్నింటిలో డ్రాప్‌ అవుట్‌లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:12 PM

Payyavula Keshav: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా గత ప్రభుత్వం పాలనపై పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే డ్రాప్‌ అవుట్‌ల కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్నారు మంత్రి.

Payyavula Keshav: అన్నింటిలో డ్రాప్‌ అవుట్‌లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం
Minister Payyavula Keshava

అమరావతి, ఫిబ్రవరి 28: ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మొదట గత పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఆ తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ మేరకు నష్టపోయిందో, అభివృద్ధిలో ఎలా తిరోగమనం చెందిందో తెలిపారు. ఇదిలా ఉండగా.. తన బడ్జెట్ ప్రసంగంలో డ్రాప్ అవుట్స్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్నారు మంత్రి. గత ప్రభుత్వంలో స్కూళ్లల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్సే కాదు.. చాలా రంగాల్లో డ్రాప్ అవుట్స్ జరిగాయన్నారు.


పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయని.. రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుటయ్యాయని... పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయిందని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో.. సభకు రాకుండా.. అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారని సెటైర్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజా జీవితం నుంచి శాశత్వంగా డ్రాప్ అవుట్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయంటూ పయ్యావుల కేశవ్ సంచలన కామెంట్స్ చేశారు.


పెద్దల పేర్లు ప్రస్తావిస్తూ...

అలాగే బడ్జెట్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Patrudu), సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) పేర్లను మంత్రి ప్రస్తావించారు. ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన కామెంట్లను.. తీసుకుంటున్న చర్యలను ప్రసంగంలో తెలిపారు. చెత్త పన్నుపై అయ్యన్న కామెంట్లు గుర్తు చేయడంతో అప్పటి అయ్యన్న కామెంట్లను సభ్యులు చర్చించుకున్నారు.

payyavual-ap-budget3.jpg


అయ్యన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ..

స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపక్షంలో ఉండగా చెత్త పన్ను వేసిన గత పాలకులపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయని మంత్రి తెలిపారు. అప్పులనే కాదు.. చెత్తను వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. చెత్త పన్ను వేయడమే కాకుండా.. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.


2కే కిలో బియ్యంపై...

అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2కే కిలో బియ్యం పథకం గురించి కూడా పయ్యావుల బడ్జెట్‌లో ప్రస్తావించారు. కాలే కడుపునకు పట్టెడన్నం పెట్టేందుకు ఎన్టీఆర్ రూ. 2కే కిలో బియ్యం పథకం ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకమే జాతీయ స్థాయిలో చట్టంగా మారిందని... అదే ఆహర భద్రత చట్టమని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

MLC Election: పోటెత్తిన టీచర్లు

AP Budget 2025: అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..

Read Latest AP news And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 12:12 PM