Share News

AP Cabinet: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు... ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Feb 06 , 2025 | 12:49 PM

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి మంత్రి మండలి సమావేశంలో చర్చ జరుగగా.. 34 శాతం రిజర్వేషన్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Cabinet: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు... ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
AP Cabinet meeting

అమరావతి, ఫిబ్రవరి 6: ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. మొత్తం 21 అంశాలు ఏజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. అలాగే దేశీయ తయారీ విదేశీ మద్యం, బీర్లు, ఎఫ్‌ఎల్- స్పిరిట్‌పై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ రివిజన్‌పై కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది మంత్రి మండలి. పలు ముఖ్యమైన అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చజరుగుతోంది.


విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్‌లో ఆమోదం లభించింది. గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో వెయ్యి గజాల వరకు కూడా సవరణ చేయలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్టసవరణకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రిమండలి ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అనుచరుల హల్‌చల్‌


ఎమ్‌ఎస్‌ఏఈ పాలసీని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. బడ్డి ఇండస్ట్రీలిస్టులకు అనేక ప్రోత్సహకాలు ఇచ్చారు. అయితే ఈసారి దాంట్లో స్వల్ప మార్పులు చేస్తూ కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సహకాలు అందించే విధంగా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతో పాటు.. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రెండు సార్లు నగుదును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ చేసే విధంగా కేబినెట్‌లో చర్చించారు.


ఇవి కూడా చదవండి...

మోడీ వినూత్న ఆలోచన.. విద్యార్థుల కోసం ఏకంగా..

మీ భార్య అకౌంట్‌కు డబ్బులు పంపుతున్నారా? ఈ రూల్ తెలుసుకోండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 01:04 PM