MLC Elections: ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:27 AM
ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు.

అమరావతి: ఏపీ (AP)లో కృష్ణ (Krishna), గుంటూరు జిల్లాల (Guntur Dist.) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) పోలింగ్ (Polling) గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికో న్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284A లో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు.
ఈ వార్త కూడా చదవండి..
ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేయడానికి ఈ ఓటును హక్కుగా తీసుకుని.. బాధ్యతగా ఓటు వేయాలని చంద్రబాబు అన్నారు.
కాగా కృష్ణ, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 33 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం, మొగల్తూరులలో ఎనిమిది కేంద్రాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మొదలైంది. అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుడివాడ పట్టణంలో 10....గ్రామీణ ప్రాంతాల్లో 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యా యులు ఓటు వేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం 123 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈరోజైనా వంశీ నోరు విప్పుతారా..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News