Share News

Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయి

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:59 PM

Daggubati Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని పురందేశ్వరి ఆరోపించారు.

Purandeswari  : దేవాలయాలపై దాడులు పెరిగాయి
Daggubati Purandeswari

విజయవాడ : దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని ఆరోపించారు. గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్‌ మెడోస్‌ ప్రాంగణంలో ఇవాళ (ఆదివారం) హైందవ శంఖారావం (Hindu Sankharavam) సభ జరిగింది. ఈ సభలో వీహెచ్‌పీ (VHP) జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. ఈ సభలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని పురందేశ్వరి పేర్కొన్నారు.

ఆ చట్టంతో అర్చకుల హక్కులను కాలరాశారు: మాజీ సీఎస్, ఎల్వీ.సుబ్రహ్మణ్యం

LV-Subrahmanyam.jpg

1987లో చేసిన దేవాదాయ, ధర్మాదాయ చట్టం మన ఆలయాల పాలిట శాపంగా మారిందని మాజీ సీఎస్, ఎల్వీ.సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మన ఆలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని తెచ్చి అర్చకుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. 1987లో తెచ్చిన చట్టం మన ఆలయాల ధ్వంసానికి కారణమైందని ఎల్వీ.సుబ్రహ్మణ్యం అన్నారు.


తిరుమల వెంకన్న ఆలయాన్ని రాజకీయాలకు వినియోగించారు: అలోక్ కుమార్

Alok-Kumar.jpg

ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు 1817లో ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం‌ చేయడానికి ఆలయాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలే ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు‌ చెందిన లక్షల ఎకరాలను అన్యాక్రాంతం చేశారన్నారు. ఎవరికీ లేని ఆంక్షలు, నిబంధనలు ఆలయాల పైనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ, కొన్ని చోట్ల అన్యమతస్తులకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. అలాంటి వారు ఆలయాల పవిత్రత, హిందూ ధర్మపరిరక్షణను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు. కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకన్న ఆలయాన్ని రాజకీయాలకు వినియోగించారని ఆరోపించారు. ఆలయాల పవిత్రత దెబ్బతినేలా కొంతమంది వ్యవహరించారని అన్నారు. ఆలయాల్లో ఆచార వ్యవహారాలను మంటగలిపారని మండిపడ్డారు. పాలక మండళ్ల పేరుతో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను ఇష్టం వచ్చినట్లుగా మళ్లించారని చెప్పారు. తిరుమలకు భక్తులు ఇచ్చే కానుకలను కూడా పక్కదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇలా హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఆలయాలను పరిరక్షించకుండా ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాలకు అన్యాయం జరుగుతూనే‌ ఉందని అన్నారు. ఇక అందరం కలిసికట్టుగా ఉద్యమించి .. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని అలోక్ కుమార్ పేర్కొన్నారు.


ధర్మజాగరణ, ధర్మసంరక్షణ కోసమే ఈ హైందవ శంఖారావం: గోవింద్ దేవ్ గిరి మహారాజ్

Swami-Govind-Dev-Giri-Mahar.jpg

ధర్మజాగరణ, ధర్మసంరక్షణ కోసమే ఈ హైందవ శంఖారావమని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్‌గిరి మహారాజ్ తెలిపారు.మన దేవాలయాలు కేవలం ప్రార్ధనా మందిరాలే కాదు...దేవునికి నిలయాలు అని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట మన హైందవ సమాజం అంతా కలిసి నిర్వహించుకున్న కార్యక్రమమని గుర్తుచేశారు. అయోధ్యలో రామజన్మభూమిని స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. దేశంలోని అన్ని ఆలయాలను మనమే స్వయంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Sankharavam: శంఖారావం సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు..

Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్‌

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 05 , 2025 | 03:20 PM