Share News

Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Mar 01 , 2025 | 11:43 AM

Anitha: అంతర్యుద్ధం వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదని.. ఆ వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు.

Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Home Minister Vangalapudi Anitha

అనంతపురం , మార్చి 1: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Former MP Gorantla Madhav) వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో అంతర్యుద్ధం లేదని.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవుపలికారు. నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదని... ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వమన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు.


పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని.. అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.... అనుభవించేది రాజానే అని అన్నారు. పోలీస్ శాఖలో 900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారని.. అవన్నీ తాము తీరుస్తున్నామన్నారు. ఇంతవరకు ఏపీకీ అప్పా లేదని... గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని చెప్పారు. త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

CM Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు


కాగా.. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్‌పై టీడీపీ, జనసేన పార్టీలు సీరియస్‌ అయ్యాయి. మాధవ్ చేసిన వ్యాఖ్యలపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు రెండు పార్టీల నేతలు. గోరంట్ల వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. అత్యాచార బాధితురాలి పేరు భయపెట్టారంటూ విచారణకు రావాల్సిందిగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల చేసిన కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా చేశాయి.


ఇవి కూడా చదవండి...

Vision 2047: పండంటి ప్రగతికి 10 సూత్రాలు!’

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2025 | 11:43 AM