Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 05 , 2025 | 09:11 PM
Nara Lokesh : ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి.. ఐటీ పాలసీతోపాటు చట్టాలపై సమగ్రంగా చర్చించానని నారా లోకేష్ తెలిపారు. అలాగే ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు గవర్నెన్స్ గురించి, తమ ప్రతిపాదనల గురించి ఆయనకు వివరించానని చెప్పారు. డేటా సిటీ ప్రతిపాదనపై ఆయన చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అందులోభాగంగా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారుతోపాటు కాన్వాయ్ కూడా ఇచ్చామన్నారు. బుధవారం న్యూఢిల్లీలో మంత్రి నారా లోకేష్ విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లాలంటే రోఫ్స్‌తో అడ్డుకట్టారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ అధికారంలో లేక పోయినా వారి కుటుంబానికి ఎక్కడా సెక్యూరిటీ మాత్రం తగ్గించ లేదని స్పష్టం చేశారు.
అదే తమ కుటుంబానికి వెంటనే సెక్యూరిటీ తీసేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు ఎవరు తగ్గించలేదన్నారు. జగన్ చేతకానీ తనం వల్లే పోలవరం అస్తవ్యస్థమైందని పేర్కొన్నారు. ఆర్ ఎండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వాలి ఆయన తెలిపారు. వైఎస్ జగన్‌కు చెడ్డ అలవాటు ఉందని.. ఆయన ఆత్మలతో మాట్లాడతాడంటూ మంత్రి నారా లోకేష్ వ్యంగ్యంగా అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్న వారి కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకోసం ఢిల్లీలో తెలుగు వారికి ఏ సమస్య వచ్చిన మంత్రులు,ఎంపీలు అందుబాటులో ఉన్నారన్నారు.
ఢిల్లీ పర్యటన పలప్రదం.. నారా లోకేష్
ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి.. ఐటీ పాలసీతోపాటు చట్టాలపై సమగ్రంగా చర్చించానని నారా లోకేష్ తెలిపారు. అలాగే ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు గవర్నెన్స్ గురించి, తమ ప్రతిపాదనల గురించి ఆయనకు వివరించానని చెప్పారు. డేటా సిటీ ప్రతిపాదనపై ఆయన చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా కేంద్ర పథకాలు అమలు కాలేదన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజ్ గురించి ధన్యవాదాలు చెప్పేందుకు కుమారస్వామిని కలిశానన్నారు. రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు.. వివిధ రంగాల్లో ఏపీకి పైప్ లైన్లో ఉన్నాయని.. ఇవి 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నాయని నారా లోకేష్ సోదాహరణగా వివరించారు.
ప్రశాంత్ కిషోర్‌ను కలవడంలో ప్రత్యేకమేం లేదు..
తాను అందరినీ కలుస్తానన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శకులను సైతం కలవాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఉంటాను. అందులో భాగంగా అనేక మందిని కలుస్తుంటానని వివరించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీని పెద్ద ఎత్తున అమలు చేయాలని చూస్తున్నామని వివరించారు. అలాగే రాష్ట్రంలో డిఫెన్స్ పరికరాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. అనంతపూరంను డిఫెన్స్ హబ్‌గా మార్చవచ్చునని చెప్పానన్నారు. సమీపంలో బెంగళూరు మహానగరం ఉంది కాబట్టి.. సులభతరంగా ఉంటుంది వివరించానన్నారు. అలాగే మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి రాష్ట్రానికి నిధులు పెంచాలని కోరినట్లు చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు టెక్నాలజీ జోడించి పాఠ్యాంశాలు తయారు చేయాలని చూస్తున్నామని తెలిపానన్నారు. అదే విధంగా ఏపీలో విద్యామంత్రుల సదస్సు నిర్వహించాలని కోరానన్నారు.
మంగళవారం సాయంత్రం మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్ల ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు టీడీపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు.. మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా గడిచింది. బుధవారం ఉదయం.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార్ స్వామిని కలిశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో.. కేంద్రం తీసుకొన్న చొరవ పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి కుమార స్వామికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కుమార స్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో సైతం నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Also Read : డిఫరెంట్‌గా కేకే సర్వే.. జాతీయ సంస్థల అంచనాలు తలకిందులవుతాయా?
Also Read: ఎగ్జిట్ పోల్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ ఓటరులు జై కొట్టింది ఎవరికంటే..
Also Read: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Also Read: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం
Also Read: డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్.. షూటర్ల కోసం గాలింపు
Also Read : కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు
Also Read: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్
For AndhraPradesh News And Telugu News