Palla Srinivasa Rao : వైసీపీ వలలో పడొద్దు!
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:26 AM
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ...

‘డిప్యూటీ సీఎం’ డిమాండ్లు పార్టీ క్రమశిక్షణ అతిక్రమణే
కూటమి పార్టీల్లో విభేదాలకు కాలకేయులు ఎదురుచూస్తున్నారు
అందరం అప్రమత్తంగా ఉండాలి
టీడీపీ నేతలకు పల్లా పిలుపు
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉపముఖ్యమంత్రి పదవిని లోకేశ్‌కు ఇవ్వాలని టీడీపీ నేతలు బహిరంగంగా డిమాండ్లు చేయడం పార్టీ నియమావళిని అతిక్రమించడమే. మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది. దానిని మీరవద్దు. లోకేశ్ శక్తిసామర్థ్యాలు అందరికీ తెలుసు. నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. దీనిపై బహిరంగ చర్చ పెట్టొద్దు.. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ నేతలు కాలకేయుల మాదిరిగా ఎదురు చూస్తున్నారు. వివాదంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. నేతలందరూ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ వలలో పడకుండా చూసుకోండి’ అని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి రూ.13వేల కోట్ల సాయం తేగలిగామని తెలిపారు. రెండేళ్లు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిస్తే సెయిల్‌లో విలీనం చేయించడానికి సిద్ధం అని చెప్పారు. యువనేత లోకేశ్ వల్ల టీడీపీలో యువోత్సాహం వచ్చిందని అన్నారు. ‘రాష్ట్రానికి ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడానికి లోకేశ్ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నారు’ అని పల్లా ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News