Share News

Guntur : బడి స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ కార్యకర్త

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:00 AM

స్వర్ణాంధ్ర నగర్‌లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త శ్రీదేవి ఆక్రమించుకోవడంతో పాఠశాలను పక్కనే ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తున్నారని..

Guntur : బడి స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ కార్యకర్త

  • పశువుల పాకలో పాఠశాల నిర్వహణ

  • టీడీపీ గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఫిర్యాదు

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్వర్ణాంధ్ర నగర్‌లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త శ్రీదేవి ఆక్రమించుకోవడంతో పాఠశాలను పక్కనే ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గుంటూరుకు చెందిన కర్రి యోహోను అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల కార్యక్రమం జరిగింది. మంత్రి కె.పార్థసారధి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ ప్రజల వినతులు స్వీకరించారు. వైసీపీ నాయకులు చనిపోయిన తన భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసి తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన డి.భారతి విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడుకు చెందిన బోడపాటి చంద్రమౌళి.. తనకు 3.39 సెంట్లు భూమి ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన రీసర్వేలో దాన్ని 3.10 సెంట్లకు తగ్గించి నమోదు చేశారని, దీనిపై మళ్లీ రీసర్వే చేసి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Feb 18 , 2025 | 05:00 AM