Share News

Amaravati : ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెల్లివిరియాలి.. తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్

ABN , Publish Date - Jan 13 , 2025 | 10:58 AM

Hyderabad : సమస్యలు తొలగిపోయి ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు..

Amaravati : ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెల్లివిరియాలి.. తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్
Telugu States CM's Tweet On Bhogi Festival

కొత్త ఏడాదిలో వచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి ఇంటా భోగ భాగ్యాలు కలగాలని ఇద్దరు సీఎంలు ఆకాంక్షించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. "పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు." అని ట్వీట్ చేశారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇలా ట్వీట్ చేశారు. "పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు... ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని" ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు.

Updated Date - Jan 13 , 2025 | 12:02 PM