Share News

TOP 10: టాప్ టెన్ వార్తలు ఇవే

ABN , Publish Date - Jan 01 , 2025 | 09:32 AM

ఆంధ్రజ్యోతి.కామ్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

TOP 10: టాప్ టెన్ వార్తలు ఇవే
TOP 10 News

1)ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూటమి అగ్రనేతలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తులతుగాలని వారు ఆకాంక్షించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు మరింత ఆదాయం పొంది సంతోషంగా ఉండాలని కోరారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


2) కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఉదయం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు (Special Prayers) చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుస్తారు. అయితే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలకు తెలిపేందుకు బోకేలు, శాలువాలు తేవద్దని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


3) 6 వేలు కాదు.. 10 వేలు

దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


4) ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శనాల బుకింగ్‌!

తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సామాన్య భక్తుల దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్‌ దర్శన టికెట్లు బుక్‌ చేసుకునేలా ఆలోచన చేస్తున్నారు. నిత్యం దాదాపు 60-70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


5)బాబోయ్.. పీపాలు పీపాలు ఖాళీ చేసినట్లున్నాడు.. ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా..

కొన్ని సంఘటనలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించడానికి పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడం సర్వసాధారణం. ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


6) నూతన సంవత్సరం వేళ విజయవాడ సీపీ సూచనలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో యువకులు పెద్దఎత్తున న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో పబ్బులు, రోడ్లపై యువత ఎంజాయ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి 2024 ఏడాదికి గుడ్ బై చెప్తూ.. 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


7) మణిపూర్‌ సీఎం క్షమాపణ

జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణతో 2023 మే నుంచి ఆ రాష్ట్రంలో హింస కొనసాగుతోంది. 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది ఇళ్లను వీడిపోయారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


8) కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో (Kanipaka Varasiddhi Vinayaka Temple) న్యూ ఇయర్ సందడి (New Year Eve) నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు (Devotees) భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


9) ఈ ఏడాదీ ఫుల్‌ జోష్‌..

క్రీడాభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్‌ పండుగ రానుంది. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న చాంపియన్స్‌ ట్రోఫీ హైలైట్‌గా నిలవనుంది. హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించనున్న తొలి ఐసీసీ ఈవెంట్‌ కావడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, మహిళల వన్డే వరల్డ్‌కప్‌.. భారత్‌లో జరగనున్న మెగా ఈవెంట్‌. ఎప్పటి లాగానే టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లు మజాను పంచనున్నాయి. ఎఫ్‌-1 రేస్‌ల క్యాలెండర్‌ ఫుల్‌గా నిండిపోగా.. బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, ఖో-ఖో వరల్డ్‌కప్‌ అలరించనున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


10) నిబంధనల ఎఫెక్ట్‌ ఏమేరకు..

రానున్న రోజుల్లో తెలంగాణాలో సినిమా ఈవెంట్స్‌ హడావుడి తగ్గనుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లో ఈవెంట్స్‌పై కఠినంగా వ్యవహరించనుండటం, రిలీజ్‌పై ఎలాంటి బెనిఫిట్‌కు ఆస్కారం లేదని చెప్పేసిన తరుణంలో ఇక సినిమా సందడంతా ఆంధ్రాలో (Sankranti Sandadhi) ఉండనుందని తెలుస్తోంది. రాబోయే సంక్రాంతి సినిమాల రిలీజ్‌ హడావుడితో పాటు వాటి ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ కూడా భారీగా చేయాలంటే, హీరోలు మేకర్స్‌ ఇప్పుడు ఏపీ వైపే చూస్తున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2025 | 09:32 AM