Share News

Nara Lokesh :మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్

ABN , Publish Date - Mar 31 , 2025 | 07:22 PM

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.

Nara Lokesh :మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్
Nara Lokesh

అనకాపల్లి జిల్లా: ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం జంక్షన్‌లో ఇవాళ (సోమవారం) రూ.243 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి, విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగళంలో (Yuvagalam) నారా లోకేష్ ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. అచ్చుతాపురం జంక్షన్‌లో, సాంస్కృతిక కార్యక్రమాలతో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంత్రి నారా లోకేష్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత , మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు.


కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఈ ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లు ఏ రోడ్లను మరమ్మతు చేయలేదని మండిపడ్డారు. అనకాపల్లి- అచ్చుతాపురం నాలుగులైన్ల రోడ్డు వస్తోందని.. పనులు త్వరగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. హైడ్రోజన్ పార్కు, ఆర్సీలర్ మిట్టల్, బల్క్‌డ్రగ్ పార్క్, ఈ జిల్లాకు వస్తున్నాయని చెప్పారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


మూడు పార్టీలు కలసి కట్టుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత కూటమిపై ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ 151 సీట్లు 11 కావడానికి గత పాలకుల అన్యాయాలు, అరాచకమే కారణమని విమర్శించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అందరికీ దిమ్మతిరిగేలా తీర్పువచ్చిందని ఉద్ఘాటించారు. అందుకే కూటమికి 94శాతం సీట్లతో ప్రజలు విప్లవాత్మకమైన గెలుపును అందించారని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 07:46 PM