Share News

8th Pay Commission Update : గుడ్ న్యూస్.. ఈ సారి 2 విడతల్లో డీఏ..? రెట్టింపు కానున్న పెన్షన్లు, జీతాలు..!

ABN , Publish Date - Feb 18 , 2025 | 08:24 PM

8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఎనిమిదో వేతన సంఘం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరో తీపి కబురు అందించింది. 8వ వేతన సంఘం ప్రకారం.. ఉద్యోగులకు బకాయిపడిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ (DA), డీఆర్‌ బకాయిలు రెండు విడతల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా..

8th Pay Commission Update : గుడ్ న్యూస్.. ఈ సారి 2 విడతల్లో డీఏ..? రెట్టింపు కానున్న పెన్షన్లు, జీతాలు..!
Central Govt Employees Get Massive Hike

8th Pay Commission Update : గత సంవత్సరం జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ వేతన సంఘం గురించి ప్రభుత్వం వివరణాత్మక సమాచారాన్ని లేదు కానీ.. కేంద్ర ఉద్యోగుల అంచనాలను పెంచేలా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిన తర్వాత ఉద్యోగుల జీతం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీనితో పాటు ఆగిపోయిన కరువు భత్యం కూడా త్వరలో విడుదలకానుంది..


కరువు భత్యం ఎంత?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 53 శాతం కరువు భత్యం (DA) లభిస్తోంది. 8వ వేతన సంఘం అమలుకు ముందు కేంద్ర ఉద్యోగులకు మరో రెండు కరువు భత్యాలు లభిస్తాయి. రెండుసార్లు 4-3 శాతం పెరుగుదల ఉంటే అప్పుడు భత్యం 60 శాతానికి పెరుగుతుంది. దీని అర్థం కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలు చేశాక కరువు భత్యం సుమారు 60 శాతానికి చేరుకుంటుంది.


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే?

7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీని ప్రకారమే కనీస వేతనం పెరుగుతుంది. (6వ వేతన సంఘం) లో లెవల్ 1 ఉద్యోగుల కనీస జీతం రూ.7వేలుగా ఉండేది. 7వ వేతన సంఘంలో అది రూ.18వేలకి చేరుకుంది. డీఏ, హెచ్ ఆర్ ఏ, ట్రావెల్ అలవెన్స్, ఇతరత్రా ప్రయోజనాలు కలిపి మొత్తం రూ. 36,020లకు పెరిగింది.


ఈసారి ఫిట్‌మెంట్ 2.86కి పెంపు?

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ 2.86కి పెంచబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే లెవల్ 1లో మూల వేతనం రూ.18వేలు ఉన్నవారికి జీతం అమాంతం రూ.51,480కి పెరుగుతుంది. ఇదే మాదిరి ఇతర లెవెల్స్ ఉద్యోగులకు జీతం, పెన్షన్‌ గణనీయంగా పెరుగుతాయి.


త్వరలో అధికారిక ప్రకటన

ఎనిమిదవ వేతన సంఘం ఛైర్మన్, సభ్యుల పేర్ల ప్రకటన కమిషన్ పరిగణించే అంశాలకు సంబంధించిన సమాచారం త్వరలో విడుదలవుతుంది. కాగా, ఏడవ వేతన సంఘం 2016లో ఏర్పడింది. 2026 జనవరి 21 లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. ఈ మధ్యలోనే రెండుసార్లు డీఏ పెంచే ఛాన్స్ ఉందని సమాచారం. కొత్త వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ఉద్యోగుల వేతన స్కేళ్లు, కరువు భత్యాలు వచ్చే ఏడాది చివరి నుంచి భారీగా పెరగబోతున్నాయి. దీని ద్వారా లెవల్ 1 నుంచి లెవల్ 10 వరకు ఉన్న దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.


ఇవి కూడా చదవండి..

Unemployment Rate: దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగితపై కీలక నివేదిక..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 08:31 PM