Share News

Hyderabad: స్నేహం నటించి.. డబ్బు కొల్లగొట్టి.. మొత్తం 48.38 లక్షలు గోవిందా..

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:03 AM

ఓ యువతికి స్నాప్‌ చాట్‌ ద్వారా పరిచయమైన యువకుడు స్నేహితులతో ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం రూ. 48.38లక్షలు కొల్లగొట్టాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్‌ హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు.

Hyderabad: స్నేహం నటించి.. డబ్బు కొల్లగొట్టి.. మొత్తం 48.38 లక్షలు గోవిందా..

- స్నాప్‌ చాట్‌లో పరిచయం.. డబ్బుకోసం వంచన

- ముఠాగా ఏర్పడి యువతికి బెదిరింపులు

- విడతల వారీగా డబ్బులు డ్రా చేయించిన సైబర్‌ క్రిమినల్స్‌

- ఆటకట్టించిన సిటీ పోలీసులు, ముగ్గురికి బేడీలు

హైదరాబాద్‌ సిటీ: ఓ యువతికి స్నాప్‌ చాట్‌ ద్వారా పరిచయమైన యువకుడు స్నేహితులతో ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం రూ. 48.38లక్షలు కొల్లగొట్టాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్‌ హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. సీపీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతికి స్నాప్‌చాట్‌లో అమన్‌ జోషి పరిచయమయ్యాడు. ముందుగా ఆమెతో స్నేహం నటించి పరిచయం పెంచుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 2,74,856 దరఖాస్తుల పరిశీలన పూర్తి


ఆ తర్వాత తన అవసరాలకోసం ఆమెనుంచి రూ. 15వేలు అప్పు తీసుకున్నాడు. ఆమెను బెదిరించి, భయపెట్టి, లక్షల్లో డబ్బులు లాగాలని పథకం వేశాడు. మరో ఇద్దరు స్నేహితులు ప్రశాంత్‌, రోహిత్‌ శర్మతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రోహిత్‌శర్మ ఆమెను ఆన్‌లైన్‌లో సంప్రదించి పోలీస్‌ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. మీవద్ద అక్రమ బంగారం ఉందని, అమన్‌ జోషితో పాటు మీకూ అక్రమ బంగారంతో లింక్‌ ఉందని బెదిరించాడు. క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపుతానని బెదిరించాడు.


city3.jpg

అలా జరగకుండా ఉండాలంటే రూ. 2లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. భయపడిన యువతి రూ. 2లక్షలు చెల్లించింది. అలా రోజుల తరబడి యువతిని మానసికంగా వేధించి, విడతల వారీగా రూ. 48.38లక్షలు కొట్టేశారు. తన ఉద్యోగాన్ని, కెరియర్‌ను దృష్టిలో పెట్టుకున్న యువతి వారి వేధింపులను మౌనంగా భరించి తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. వీరి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు యత్నించి చివరకు బయటపడింది. ఎవరో కావాలని ట్రాప్‌ చేసి, డబ్బుకోసం వేధిస్తున్నారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Hyderabad Police Commissioner CV Anand)కు ఫిర్యాదు చేసింది.


రంగంలోకి దిగిన సిటీ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌(City Cyber ​​Crime Inspector Naresh) టీమ్‌.. డీసీపీ ధార కవిత, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. రామ్‌కోఠికి చెందిన అమన్‌జోషి, షాహినాయత్‌గంజ్‌కు చెందిన ప్రశాంత్‌, కళాహనుమాన్‌కు చెందిన రోహిత్‌శర్మను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. నిందితులు ఈజీ మనీ కోసం స్నాప్‌చాట్‌లో వలవేసి, డబ్బున్న వారిని, అమాయకులను టార్గెట్‌ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

city3.3.jpg


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 11:03 AM