Share News

Weight Loss : ఈ చిట్కాలు పాటిస్తే.. జిమ్‌కు వెళ్లకుండానే.. ఈజీగా బరువు తగ్గుతారు..

ABN , Publish Date - Jan 05 , 2025 | 07:01 PM

సులువుగా అధిక బరువు తగ్గడమెలా అని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే.. జిమ్‌కు వెళ్లకుండానే.. ఈజీగా బరువు తగ్గుతారు..

Weight Loss : ఈ చిట్కాలు పాటిస్తే.. జిమ్‌కు వెళ్లకుండానే.. ఈజీగా బరువు తగ్గుతారు..
Fastest Way to Weight Loss

ఈ రోజుల్లో 30 సంవత్సరాలకే ఆడ,మగ తేడా లేకుండా అందరినీ రకరకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అందులో ప్రధానమైంది ఊబకాయం. ఈ సమస్య ఉంటే చిన్న పని చేసినా త్వరగా అలసిపోతుంటారు. అలా అని ఏ పని చేయకుండా తిని కూర్చుంటే బీపీ, షుగర్, గుండె జబ్బులు ఒకదాని వెంట ఒకటి వచ్చిపడే ప్రమాదముంది. అదీ గాక ఊబకాయుల్లో ఆత్మన్యూనతాభావమూ ఎక్కువే ఉంటుంది. నలుగురిలో కలవలేక కుంగుబాటుకు గురవుతుంటారు. దీన్ని నుంచి బయటపడాలని అనుకునేవారు అధిక బరువు వదిలించుకునేందుకు జిమ్‌ల వెంట పడుతుంటారు. చాలాసార్లు చేతి చమురు వదిలినా ఫలితం మాత్రం దక్కడంలేదు. మీరు కూడా అలాంటివారిలో ఉంటే జిమ్‌కు వెళ్లకుండానే ఈ చిట్కాలు పాటించండి చాలు. ఈజీగా బరువు తగ్గుతారు.


ఊబకాయం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. వంశపారంపర్యంగా, జన్యుపరంగా లావు కావచ్చు. కొన్ని సార్లు తినకపోయినా మారిన లైఫ్‌స్టైల్ వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంది. కారణమేదైనా, ఊబకాయుల్లో చాలామంది తమ ఆకారం గురించి అసంతృప్తి చెందుతుంటారు. తమని తాము నిందించుకుంటూ బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉంటాం. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామం చేసినా, డైట్ మార్చినా ఫలితం లేదని భావించే వారు ఈ కింది టిప్స్ ఫాలో అవండి.


ఒత్తిడి

బరువు తగ్గాలని కోరుకునేవారికి ఒత్తిడి పెద్ద అడ్డంకి. ఇది మీరు బరువు తగ్గించే ప్రాసెస్‌ను నెమ్మదించేలా చేస్తుంది. అందుకే, తక్కువ క్యాలరీలు తీసుకుంటూ తీవ్రంగా వ్యాయామం చేసినా ఎలాంటి ఫలితం కనిపించదు. కాబట్టి, ముందు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయండి.

నిద్ర

చాలా మంది నిద్రకు ప్రాధాన్యత ఇవ్వరు. నిర్ణీత సమయానికి పడుకోవడం, లేవడం వంటివి చేయరు. రోజులో 6-7 గంటలైనా నిద్రపోతున్నామా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే, నిద్రలేమి ఊబకాయం సహా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.


డ్రింక్స్, చక్కెరలు

30 సంవత్సరాల వయస్సులో చాలా మందికి ఆల్కహాల్, డైట్ సోడా, అధిక చక్కెరలు కలిగిన పానీయాలు తాగే అలవాటు ఉంటుంది. డైట్ సోడాను క్యాలరీ రహిత పానీయం అని పిలిచినా.. అందులో ఉండే కృత్రిమ స్వీటెనర్ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, ఈ అలవాట్లు శరీరంలో కొవ్వును మరింత పెంచేలా చేస్తాయి.

జంక్ ఫుడ్స్

జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారికి ఊబకాయం వచ్చే అవకాశాలు అధికం. బరువు వదిలించుకోవాలనుకుంటే, ముందుగా మీ ఆహారం నుంచి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా తొలగించండి. బదులుగా ఇంట్లో వండినవే తినండి.


ఉపవాసం

బరువు తగ్గాలనుకునేవారూ అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకలి వేసినప్పుడల్లా తక్కువ మోతాదులో తింటూ కడుపులో ఎప్పుడూ కొంత ఖాళీ ఉండేలా చూసుకుంటే శరీరంలో ఉండే కొవ్వులు కరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

ప్రొటీన్

మీ రోజువారీ డైట్‌లో ప్రొటీన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి ఇదెంతో ముఖ్యమైనది. ఇది జీవక్రియను మెరుగుపరిచి కేలరీలను బర్న్ చేయడానికి సాయపడుతుంది. కండరాలు, ఎముకల దృఢత్వం పెంచడంలోనూ ప్రొటీన్‌లది కీలకపాత్ర.

Updated Date - Jan 05 , 2025 | 07:01 PM