Share News

Heart Attacks at Young Age: యువతలో పెరుగుతున్న గుండెపోటు గుబులు.. ఎందుకిలా జరుగుతోంది..

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:50 PM

Reasons Behind Heart Attacks At Young Age : ఆడే పాడే వయసులోనే గుండె చప్పుడు ఎందుకు ఆగిపోతోంది. ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు ఎందుకొస్తోంది. యువతలో హార్ట్ ఎటాక్ కేసులు ఈ మధ్య ఎందుకు పెరిగిపోతున్నాయి. ఊహ తెలిసీ తెలియకముందే గుండెపోటు ఎందుకు కాటేస్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు ఇవే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

Heart Attacks at Young Age: యువతలో పెరుగుతున్న గుండెపోటు గుబులు.. ఎందుకిలా జరుగుతోంది..
What Causes Heart Attacks in Young People

Reasons Behind Heart Attacks At Young Age : ఒక అమ్మాయి లేదా అబ్బాయి స్కూల్ గ్రౌండ్ స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటూనే గుండెపోటు వచ్చి హఠాత్తుగా కుప్పకూలిపోతారు. ఇక పట్టుమని పాతిక దాటని యువకుడు చూసేందుకు దృఢంగానే ఉంటాడు. రోజూ జిమ్ చేస్తాడు. కానీ ఇంట్లో వాళ్లతో భోజనం చేస్తూనో, క్లాసులో పాఠాలు వింటూనో, ఆఫీసులో పనిచేస్తూనో సడన్‌గా గుండె ఆగిపోయి చనిపోతాడు. ప్రస్తుతం వార్తాపత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వాళ్లలోనే కనిపించే ఈ సమస్య పసిహృదయాలనూ వేధిస్తోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది. కారణాలేంటి..


చిన్నతనంలోనే గుండెపోటు గుబులు..

మనం బతికున్నకాలం నిర్విరామంగా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే ఏకైక అవయవం గుండె. ఒక్క క్షణం ఆగినా శరీరంలోని ఏ భాగం పనిచేయలేదు. వందేళ్ల పాటు పనిచేసి మన ప్రాణాలను నిలబెట్టాల్సి గుండె పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారిలో కూడా ఆగిపోతోంది. ఇందుకు కారణాలు అనేకం. కొన్ని సార్లు చురుగ్గా, క్రమశిక్షణతో ఉండే అథ్లెట్లు హార్ట్ అటాక్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే నేటితరం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయి పెరిగి బీపీ రావడం, అనారోగ్యకర ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల గుండె పనితీరుకు ఆటంకం కలుగుతోంది.


ఈ 5 శరీర భాగాలను.. చేతులతో తరచూ తాకితే ఇన్ఫెక్షన్..


ఈ అలవాట్లు మానుకోకుంటే కష్టం..

నిత్యం క్షణం తీరికలేకుండా గడపుతోంది నేటి యువతరం. అందుకే చాలామంది ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట వండిన ఆహారాన్ని అతిగా తినేస్తున్నారు. ఈ పదార్థాల్లోని కొవ్వులు, నూనెలు, చక్కెరలు వంటివి బీపీ, షుగర్, అల్సర్లు, కొలెస్ట్రాల్ తదితర అనారోగ్యాలను తెచ్చిపెడుతూ హార్ట్ ఎటాక్ వచ్చేందుకు బాటలు పరుస్తున్నాయి. పుట్టిననాటి నుంచి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, సరిపడినంత నిద్రకు దూరమవడం వల్ల ఊబకాయులుగా మారిపోతున్నారు. గుండెపోటు, డయాబెటిస్, బీపీ సహా అన్ని వ్యాధులకు మూలం అధిక బరువే. ఇక మద్యం, ధూమపానం వంటి అనేక కారణాల వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెకు రక్తప్రసరణ ఆగిపోతోంది. కాబట్టి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా జీవనవిధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని మీ గుండెని రక్షించుకోండి.


Read Also : ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగితే..ఈజీగా బరువు తగ్గుతారు..

ఈ చిట్కాలు పాటిస్తే వయసు పెరిగినా మీ కంటి చూపు అస్సలు తగ్గదు..

పాలు ఇలా మరిగించకపోతే.. చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే..

మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2025 | 04:55 PM