Attacks on Hindus In Pakistan : పాకిస్థాన్‌లో హిందువులపై ఆగని దాడులు.. బలూచిస్తాన్‌లో ఏం జరిగిందో తెలుసుకుంటే..!
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:07 PM
Attacks on Hindus In Balochistan: పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశంలో మైనారిటీలుగా జీవిస్తున్న హిందూ ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. నిరంతర ఉగ్రవాద దాడులకు జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా కొందరు ఆగంతకులు బలూచిస్తాన్‌లో హిందువులను కాల్చి చంపారు.

Attacks on Hindus In Pakistan : పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశంలో మైనారిటీలుగా జీవిస్తున్న హిందూ ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. నిరంతర ఉగ్రవాద దాడులకు జడిసి భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ చెప్పిన ప్రకారం, తాజాగా కొందరు ఆగంతకులు పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో హిందువులను బహిరంగంగానే కాల్చి చంపారు. అనుమానిత ఉగ్రవాద దాడుల పనే అని పాకిస్థాన్ పోలీసులు ధృవీకరించారు.
పాకిస్తాన్‌లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని హిందువులపై ఉగ్రవాద ముఠాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అందరూ చూస్తుండగానే కాల్పుల చేయడం లేకపోతే దాడి చేసి చంపడం పరిపాటిగా మారింది. భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా ఈ విషాదకర దాడులు ఆగడంలేదు. తాజాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని కిచ్ జిల్లాలోని టర్బాట్ ప్రాంతంలో కొందరు ఆగంతకులు బహిరంగంగా ఇద్దరు హిందువులను కాల్చి చంపారు. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తులు హరిలాల్, మోతీలాల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ అనుమానిత ఉగ్రవాదుల దాడిలో మరో హిందూ పౌరుడైన షెరోల్ కూడా తీవ్రంగా గాయపడినట్లు పాకిస్థాన్ పోలీసులు ధృవీకరించారు. అయితే, ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.
బైక్‌పై వచ్చి బహిరంగంగా హిందువులపై కాల్పులు..
ఇది కాకుండా, ఈ దాడిలో మరో వ్యక్తి కూడా మరణించాడు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మార్కెట్ సమీపంలో నలుగురిపై కాల్పులు జరిపినట్లు డిఐజీ అర్సలాన్ ఖోకర్ తెలిపారు. మరణించిన ముగ్గురు వ్యక్తులు వ్యాపారవేత్తలని.. వ్యాపార పోటీ కారణంగా వారు కాల్చి చంపేసి ఉండవచ్చని మరో పోలీసు అధికారి తెలిపారు. కాగా, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఈ సంఘటనను ఖండించారు.
ఇవి కూడా చదవండి..
Stock Market Crash: అమెరికాలో ట్రంపొచ్చె.. మార్కెట్ పోయే!
Donald Trump: అదానీకి ట్రంప్ అండ!
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..