-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Vaikunta Ekadasi 2025 Tirumala Stampede Friday 10th january 2024 Live Updates Siva
-
Breaking News: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు..
ABN , First Publish Date - Jan 10 , 2025 | 08:41 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-10T13:07:06+05:30
హైదరాబాద్ మణికొండలో కొనసాగుతోన్న హైడ్రా కూల్చివేతలు..
నెక్నాంపూర్ బఫర్ జోన్‌లో ఆక్రమణల కూల్చివేత.
బఫర్ జోన్‌లో నిర్మించిన 4 విల్లాలు నేలమట్టం.
మరో 5 విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు.
గతంలో మూడుసార్లు కూల్చివేతలు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు.
కూల్చివేతల తర్వాత తిరిగి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లు.
విల్లాలను నిర్మించిన బిల్డర్లపై కేసులు నమోదు చేసిన హైడ్రా.
-
2025-01-10T13:05:12+05:30
రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
మ.3గంటలకు కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావశం
రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సమీక్ష
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చ
జనవరి 26 నుంచి పథకాల అమలుకు ప్రభుత్వం కసరత్తు
-
2025-01-10T13:04:04+05:30
పవన్ పిఠాపురం సభ దగ్గర పోలీసుల ఓవరాక్షన్
తూర్పుగోదావరి: పవన్ పిఠాపురం సభ దగ్గర పోలీసుల ఓవరాక్షన్
సభ లోపలికి వెళ్తున్న జనసేన మహిళా నేతను అడ్డుకుని వెనక్కి నెట్టేసిన పోలీసులు.
మహిళా నేత లక్ష్మి తలకు స్వల్ప గాయం.
టీడీపీ నేత వర్మ అనుచరులనూ అడ్డుకున్న పోలీసులు.
పోలీసుల తీరుపై టీడీపీ, జనసేన శ్రేణులు ఆగ్రహం.
పవన్ సభకు 480మంది పోలీసుల మోహరింపు.
-
2025-01-10T13:01:38+05:30
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా వేళ ఆప్ - బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం.
బీజేపీ ఢిల్లీని నేర రాజధానికి అడ్డగా మార్చింది.
ఢిల్లీలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్ వార్‌లు పెరిగాయి.
మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం కష్టంగా మారింది.
బీజేపీ ఢిల్లీ ప్రజలను ద్వేషిస్తుంది.
రోహింగ్యాల పేరుతో పూర్వంచల్ ఓట్లను బిజెపి తీసేస్తుంది.
పూర్వాంచల్ ప్రజలు ఆప్ కి ఓట్లు వేస్తున్నారని బిజెపి ఇలాంటి చర్యలు చేపడుతుంది: ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
-
2025-01-10T11:09:59+05:30
రఘురామ కస్టోడియల్ చార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి షాక్..
ఏపీ హైకోర్టులో డాక్టర్ ప్రభావతికి ఎదురుదెబ్బ.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో.
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభావతి.
కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం కుదరదన్న హైకోర్టు.
-
2025-01-10T11:03:31+05:30
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్..
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత.
క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు.
బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెవిరెడ్డిపై పోక్సో కేసు.
-
2025-01-10T09:47:54+05:30
విఐపిలు వస్తే సామాన్యుల దర్శనాలకు బ్రేక్
అనంతపురం: విఐపిలు వస్తే సామాన్యుల దర్శనాలకు బ్రేక్
తిరుపతి దుర్ఘటనతో అప్రమత్తం కావాల్సినా.. తీరు మార్చుకొని పోలీసులు.
నగరంలోని పాతూరు చెన్నకేశవ స్వామి దేవాలయంలో గంటలకొద్దీ నిరీక్షిస్తున్న సామాన్యులు.
పోలీసుల బంధువులు, కుటుంబ సభ్యులకు వీఐపీ దర్శనాలు.
పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆర్డీఓ కేశవ.
అందర్నీ సామాన్య క్యూ లైన్ లోనే పంపించాలని పోలీసులకు చెప్పిన ఆర్డీవో.
వేల సంఖ్యలో సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్న.. కొంతమందికి స్పెషల్ దర్శనాలు.
-
2025-01-10T08:46:57+05:30
యాదాద్రిలో కన్నుల పండువగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో ముక్కోటి ఏకాదశి ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనం పై భక్తులకు దర్శనమిచిన లక్ష్మీ నరసింహస్వామి. -
2025-01-10T08:41:06+05:30
శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవం..
నంద్యాల: శ్రీశైలంలో వైభవంగా మల్లన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం.
ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు పెరిగిన భక్తుల రద్ది.
ఉత్తరద్వారం వద్ద శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు.
శ్రీశైలం పురవీధులలో రావణవాహనసేవపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీస్వామి అమ్మవార్లు.
కన్నులపండువగా స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం.
సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామిఅమ్మవారికి పుష్పార్చన.
మల్లికార్జునస్వామికి 40 రకాల 4 వేల కేజీల పుష్పాలతో 15 మంది పండితులతో వేద పారాయణం పుష్పార్చన.