BPSC Exam Row: బెయిలు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్.. జైలులోనే దీక్ష
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:52 PM
ప్రశాంత్ కిషోర్ అరెస్టు అనంతరం ఆయనను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కిషోర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
పాట్నా: బీపీఎస్సీ పరీక్షల వివాదం ముదురుతోంది. గత ఏడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జనవరి 2 నుంచి జన్ సురాజ్ (Jan Suraaj) చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారంనాడు భగ్నం చేశారు. ఆయనకు సివిల్ కోర్టు బెయిలు మంజూరు చేయగా, ఇందుకోసం ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. బీపీఎస్సీ పరీక్షలు రద్దు చేసేంత వరకూ ఆమరణ దీక్ష కొనసాగించేందుకు ఆయన పట్టుదలగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Atishi: ప్రెస్మీట్లో కంటతడి పెట్టిన సీఎం
పాట్నా గాంధీ మైదానంలో దీక్ష సాగిస్తున్న ప్రశాంత్ కిషోర్‌ను ఆయన మద్దతుదారుల తీవ్ర ప్రతిఘటన మధ్య పోలీసులు అక్కడి నుంచి తరలించారు. యువతకు జరిగిన అన్యాయంపై గళం విప్పడమే నేరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమేనని, జైలులో కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఐదు పాయింట్ల డిమాండ్‌పై ఆయన నిరాహర దీక్ష సాగిస్తున్నారు. అరెస్టు అనంతరం ఆయనను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కిషోర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
కాగా, రిస్ట్రిక్టెడ్ ఏరియాలో నిరసనలు చేపట్టడం చట్టవిరుద్ధమని, ఆ కారణంగానే ప్రశాంత్ కిషోర్, ఆయన మద్దతుదారులను దీక్షా స్థలి నుంచి తరలించామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కిషోర్ దీక్షా శిబిరం నుంచి తొలగించేటప్పుడు ఆయనపై చేయి చేసుకున్నారని, కొట్టారని ఆయన మద్దతుదారులు చేసిన ఆరోపణను జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తోసిపుచ్చారు. భద్రతా సిబ్బంది ఆయనపై చేయి చేసుకోలేదని, ఆయనను అరెస్టు చేయకుండా అడ్డుపడిన మద్దదారులను నిరసన స్థలి నుంచి ఖాళీ చేయించారని చెప్పారు. ఈ సందర్భంగా 43 మంది మద్దతుదారులను అరెస్టు చేసి మూడు ట్రాక్టర్లతో సహా 15 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. బీపీఎస్సీ పరీక్షల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందుందని, ఎవరైనా తమ వాదనలు చెప్పుకోవాలని అనుకుంటే అత్యు్న్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..
Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు
Read More National News and Latest Telugu News