Sanjay Raut: సెప్టెంబర్‌లో మోదీ రిటైర్మెంట్
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:22 AM
శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారని తెలిపారు. అయితే, బీజేపీ నేత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ 2029 వరకు మోదీనే ప్రధాని అని అన్నారు

ఆయన టైం అయిపోయింది: సంజయ్ రౌత్
నాగపూర్/ముంబై, మార్చి 31: ప్రధాని మోదీ సెప్టెంబర్లో పదవీవిరమణ చేయనున్నారని ఉద్ధవ్ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ దేశంలో నాయకత్వ మార్పు కోరుకుంటోందని.. రిటైర్మెంట్ ప్రణాళికలు, తన వారసుడెవరో చర్చించడానికే మోదీ ఉగాదినాడు నాగపూర్‌లోని ఆర్‌ఎ్‌సఎస్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారని సోమవారం ముంబైలో విలేకరులతో అన్నారు. 75 ఏళ్ల వయసు దాటిన బీజేపీ నేతలు పదవీ విరమణ చేస్తున్నారని.. సెప్టెంబర్లో మోదీకి కూడా 75 ఏళ్లు వస్తాయని గుర్తుచేశారు. గత 10-11 ఏళ్లలో ఆయన ఇక్కడకు రాలేదని.. ఇప్పుడు సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్‌కు టాటా, బైబై చెప్పడానికే వచ్చారని వ్యాఖ్యానించారు. ‘మోదీ టైం అయిపోయింది. ఆయన వారసుడు మహారాష్ట్ర నుంచే ఉంటారు’ అని రౌత్ తెలిపారు. అయితే, రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం, బీజేపీ సీనియర్ నేత ఫడణవీస్ తోసిపుచ్చారు. 2029లోనూ ప్రధాని మోదీయేనన్నారు
ఇవి కూడా చదవండి..
Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News