Share News

Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:25 PM

1978లో ప్రారంభించిన పవార్ 'వంచన' రాజకీయాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెరపడిందని అమిత్‌షా గత ఆదివారంనాడు వ్యాఖ్యానించారు.

Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్

ముంబై: టెంపుల్ టౌన్ షిర్డీలో జరిగిన బీజేపీ సదస్సులో కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) తనపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) తిప్పికొట్టారు. హోం మంత్రి పదవికి వన్నెతెచ్చాలా ఆయన మాట్లాడాలని అన్నారు. 1978లో ప్రారంభించిన పవార్ 'వంచన' రాజకీయాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెరపడిందని అమిత్‌షా గత ఆదివారంనాడు వ్యాఖ్యానించారు. దానిపై పవార్ స్పందిస్తూ, 1978లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన (అమిత్‌షా) ఎక్కడున్నారో కూడా తెలియదని అన్నారు.

Mark Zukererg: జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు


''నేను సీఎంగా ఉన్నప్పుడు ఉత్తమరావ్ పాటిల్ వంటి జన్‌సంఘ్ నేతలు నా మంత్రివర్గంలో ఉండేవారు'' అని పవార్ గుర్తుచేశారు. ఈ దేశం ఎంతో మంది గొప్పగొప్ప హోం మంత్రులను చూసిందని, కానీ ఏ ఒక్కరూ స్వరాష్ట్రం నుంచి బషిష్కరణ గురైన వారు లేరని పరోక్షంగా అమిత్‌షాపై విసుర్లు విసిరారు.


స్థానిక సంస్థల ఎన్నికలపై...

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వస్తున్న ఊహాగానాలు, మహా వికాస్ అఘాడి భవిష్యత్తుపై అడిగిన ఒక ప్రశ్నకు పవార్ సమాధానమిస్తూ, 'ఇండియా' బ్లాక్ ప్రధానంగా జాతీయ స్థాయి ఎన్నికలకు సంబంధించి ఏర్పడినదని చెప్పారు. రాష్ట్ర స్థాయి, స్థానిక సంస్థల గురించి 'ఇండియా' కూటమిలో ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. ముంబై స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా? విడివిడిగా పోటీ చేయాలా అనేది నిర్ణయించేందుకు రాబోయే 8-10 రోజుల్లో ఎంవీఏ పార్టీలు సమావేశమవుతాయని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుపై మాట్లాడుతూ, విపక్షాలన్నీ కేజ్రీవాల్‌కు సాయం చేయాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..

Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 14 , 2025 | 05:25 PM