Delhi Assembly Elections: ఇదే కేజ్రీవాల్ 'చమక్‌తీ' ఢిల్లీ.. రాహుల్ వీడియో
ABN , Publish Date - Jan 14 , 2025 | 06:49 PM
దేశరాజధానిలో మురికికూపంగా మారిన పలు ప్రాంతాలను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'ఇదీ కేజ్రీవాల్ మెరిసిపోతున్న ఢిల్లీ - పారిస్ వాలీ ఢిల్లీ' అంటూ క్యాప్షన్ పెట్టారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని శుభ్రతపై మాజీ సీఎం, 'ఇండియా' కూటమి భాగస్వామి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దేశరాజధానిలో మురికికూపంగా మారిన పలు ప్రాంతాలను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'ఇదీ కేజ్రీవాల్ మెరిసిపోతున్న ఢిల్లీ - పారిస్ వాలీ ఢిల్లీ' అంటూ క్యాప్షన్ పెట్టారు.
Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్
ఢిల్లీని పరిశుభ్రం చేస్తామని, అవినీతిని తొలగిస్తామని, దేశ రాజధానిని పారిస్‌గా మారుస్తామని కేజ్రీవాల్ గతంలో చెప్పడాన్ని రాహుల్ గుర్తు చేశారు. ''నిజానికి జరిగిందేమిటంటే... కాలుష్యం, ద్రవ్యోల్భణంతో జనం ఎక్కడికీ తిరగలేకపోతున్నారు'' అని రాహుల్ అన్నారు. అవీనితిని రూపుమాపారా? అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. మీడియాలో తప్పుడు హామీలు ఇస్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్లే మోదీ వ్యూహాన్నే కేజ్రీవాల్ అనుసరిస్తున్నారని, ఇద్దరికీ తేడా ఏమాత్రం లేదని విమర్శించారు.
ఢిల్లీలో సోమవారం నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలోనూ రాహుల్ ఇదే తరహా ఆరోపణలు చేశారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలకు న్యాయంగా రావాల్సిన వాటాను దక్కనీయయకుండా చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, మాజీ సీఎం కేజ్రీవాల్‌కూ తేడా లేదన్నారు. కాలుష్యం, అవీనితి, ద్రవ్యోల్భణం పెరిగిపోతున్నా మోదీ తరహాలోనే తప్పుడు హామీలతో కేజ్రీవాల్ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంతో చేసిందని, దాన్ని కొనసాగించేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు
Read Latest National News and Telugu News