Share News

Sanjay Raut: సంజయ్ రౌత్‌పై పార్టీ కార్యకర్తల దాడి..!

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:34 PM

ముంబైలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు ఇటీవల మాతోశ్రీ నివాసంలో ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే పార్టీ కార్యకర్తలు, రౌత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Sanjay Raut: సంజయ్ రౌత్‌పై పార్టీ కార్యకర్తల దాడి..!

ముంబై: శివసేన (UBT) సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్‌ రౌత్ (Sanjay Raut)పై పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్టు బుధవారంనాడు వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పోస్టులు వెలువడుతున్నాయి. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే 'మాతోశ్రీ' నివాసంలో జరిపిన పార్టీ సమావేశంలో కార్యకర్తలు సంజయ్ రౌత్‌పై దాడి చేయడమే కాకుండా ఒక గదిలో కొద్దిసేపు తాళం వేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.

BJP: ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్ఫూర్తి నేర్చుకోండి.. కేజ్రీ లేఖకు కౌంటర్


ఏం జరిగింది?

ముంబైలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు ఇటీవల మాతోశ్రీ నివాసంలో ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే పార్టీ కార్యకర్తలు, రౌత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రౌత్ వ్యాఖ్యలు, ఆయన వైఖరి కారణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని కొందరు పార్టీ కార్యకర్తలు మాట్లాడటంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కార్యకర్తలు ఆయనపై దాడి చేసి, కొద్ది గంటల సేపు ఒక గదిలో బంధించినట్టు తెలుస్తోంది. కాగా, సంజయ్ రౌత్‌పై దాడి చేసి కొద్ది గంటల సేపు గదిలో బంధించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఇటు సంజయ్ రౌత్ కానీ, ఉద్ధవ్ థాకరే కానీ, పార్టీ సీనియర్ నేతలు కానీ ఇంతవరకూ స్పందించలేదు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిపోరు

మరోవైపు, ముంబై స్థానిక ఎన్నికల్లో శివసేన ఎలాటి పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఇటీవల తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేని మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివసైనికులు పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, ఎక్కువమందిని ఎన్నికల్లో నిలిపే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఒంటరిపోరుపై పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సంజయ్ రౌత్ సైతం ఇటీవల ముంబై ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటోందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు

UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య

Updated Date - Jan 01 , 2025 | 03:36 PM