Share News

Special trains: పొంగల్‌ ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:30 PM

పొంగల్‌(Pongal) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06569 బెంగళూరు-తూత్తుకుడి ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది.

Special trains: పొంగల్‌ ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

చెన్నై: పొంగల్‌(Pongal) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.

- నెం.06569 బెంగళూరు-తూత్తుకుడి ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.06570 తూత్తుకుడి-మైసూరు ప్రత్యేక రైలు ఈ నెల 11వ తేది తూత్తుకుడిలో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు మైసూరు చేరుకుంటుంది.

ఈ వార్తను కూడా చదవండి: Pongal: ప్రైవేటు బస్సుల్లో ‘పొంగల్‌’ దోపిడీ..


- నెం.07319 బెంగళూరు-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో ఉదయం 8.05 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.20 గంటలకు చెన్నై సెంట్రల్‌(Chennai Central) చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.07320 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- బెంగళూరు ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది చెన్నై సెంట్రల్‌లో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

- నెం.06058 తిరువనంతపురం సెంట్రల్‌- చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ఈ నెల 15వ తేది తిరువనంతపురం సెంట్రల్‌లో ఉదయం 4.25 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.06059 చెన్నై సెంట్రల్‌-తిరువనంతపురం సెంట్రల్‌ ప్రత్యేక రైలు ఈ నెల 16వ తేది చెన్నై సెంట్రల్‌లో అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి రాత్రి 10 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.


- నెం.06046 ఎర్నాకుళం జంక్షన్‌- చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ఈ నెల 16వ తేది ఎర్నాకుళంలో సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.30 గంటలకు చెన్నై చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.06047 చెన్నై సెంట్రల్‌-ఎర్నాకుళం ప్రత్యేక రైలు ఈ నెల 17వ తేది చెన్నై సెంట్రల్‌లో ఉదయం 10.30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు ఎర్నాకుళం జంక్షన్‌ చేరుకుంటుంది.

nani4.2.jpg

16 బోగీలతో వందే భారత్‌ రైలు...

చెన్నై ఎగ్మూర్‌-తిరునల్వేలి మధ్య నడుపుతున్న వందే భారత్‌ రైలు 16 బోగీలతో నడుపనున్నారు. ప్రస్తుతం ఈ రైలు 7 ఏసీ ఛైర్‌ కార్‌ బోగీలు, ఎగ్జిక్యూటివ్‌ కార్‌ మొత్తం 8 బోగీలతో నడుపుతున్నారు. ఈ రైలు ప్రయాణికుల ఆదరణ పెరగడంతో, వెయిటింగ్‌ భారీగా ఉంటోంది. ఈ విషయమై దక్షిణ రైల్వే సిఫారసులతో ఈ రైలు 16 బోగీలతో నడిపేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. ఈ నెల 11వ తేది నుంచి ఈ రైలు 16 బోగీలతో నడుస్తుందని అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 01:30 PM