Share News

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:14 PM

అవిభక్త శివసేనను 2005లో రాజ్‌థాకరే విడిచిపెట్టాడు. 2006లో సొంతంగా ఎంఎన్ఎస్‌ పార్టీని స్థాపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకోగా, ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

ముంబై: రాజకీయంగా విడిపోయిన కజిన్ బ్రదర్స్ శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ థాకరే (Raj Thackeray) మరోసారి కలుసుకున్నారు. ముంబైలోని అంధేరిలో ఆదివారంనాడు జరిగిన ప్రభుత్వ అధికారి మహేంద్ కల్యాణ్కర్ కుమారుడి వివాహానికి వీరిరువురూ హాజరయ్యారు. ఉద్ధవ్ థాకరే, ఆయన భార్య రష్మిని రాజ్ థాకరే కలుసుకోవడంతో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుంటూ అహ్లాదంగా కనిపించారు. గత రెండు నెలల్లో పెళ్లి వేడుకల్లో థాకరే సోదరులు కలవడం ఇది మూడోసారి. దీంతో వీరి కలయికకు రాజకీయ ప్రాధాన్యం ఉండవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు


కొద్దికాలంగా ఇటు అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో లుకలుకలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. కూటముల్లో చీలకలు అనివార్యం కావచ్చని చెబుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగనుండటం, ఆయా పార్టీలు సొంతంగా బరిలోకి దిగుతామని ప్రకటిస్తు్న్న క్రమంలో థాకరే సోదరులు ఇటీవల వరుస కార్యక్రమాల్లో కలుస్తుండటం పలు ఊహాగానాలకు దారితీస్తోంది. ఇద్దరు సోదరులు తిరిగి చేతులు కలుపుతారనే ప్రచారం జరుగుతోంది.


అవిభక్త శివసేనను 2005లో రాజ్‌థాకరే విడిచిపెట్టాడు. 2006లో సొంతంగా ఎంఎన్ఎస్‌ పార్టీని స్థాపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకోగా, ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. రాజ్‌థాకరే కుమారుడు కూడా ఓటమి చవిచూశాడు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు శివసేన (యూబీటీ) ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, రాజ్‌థాకరేను ఎంఎన్ఎస్ కలుపుకొని వెళ్తుందా, కలిసి పనిచేసేందుకు ఇద్దరు సోదరులు ముందుకు వస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.


ఇవి కూడా చదవండి..

Delhi: అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:16 PM