BJP: బీజేపీ తమిళనాడు ఇన్‌చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Jan 04 , 2025 | 10:21 AM
బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8వ తేదీ నగరానికి రానున్నారు. పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

- 8న నగరానికి రాక
చెన్నై: బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8వ తేదీ నగరానికి రానున్నారు. పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. మళ్లీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)నే ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: HMPV: చైనాలో కొత్త వైరస్!
బీజేపీలో జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన వారు వరుసగా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగుతారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో అన్నామలై పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మళ్లీ ఆ పదవి ఆయనకే కట్టబెట్టే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
2026వ సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కారణంగా, ఎన్నికల నోటిఫికేషన్(Election notification) రాకముందే రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రపార్టీ ఇన్‌చార్జ్ హోదాలో తొలిసారి నగరానికి విచ్చేయనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఘనంగా స్వాగతించేందుకు బీజేపీ శ్రేణులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News