Share News

Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:25 PM

అన్నాడీఎంకే నేతలపై రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చానీయాంశమైంది.

Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు

- ఎడప్పాడిపై ఉదయనిధి వ్యంగ్యాస్త్రాలు

- రెండు నగరాల్లో హాకీ పోటీలు

చెన్నై: హస్తినలోని బీజేపీ అగ్రనేతలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి మూడు కార్లు మార్చి మార్చి వెళ్ళారంటూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udhayanidhi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు సభ్యులంతా సరదాగా మాట్లాడుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జరిగిన సభా కార్యక్రమాల్లో యువజన క్రీడలు, అభివృద్ధి తదితర శాఖల అనుబంధ పద్దులపై చర్చ జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Vijay: అధికారపార్టీతోనే మాకు ప్రధాన పోటీ..


ఇందులో ఆ శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మాట్లాడుతూ. ‘ఏదో మునిగిపోయినట్టుగా, హుటాహుటిన సభ నుంచి విపక్ష నేత ఎడప్పాడి, ఆ పార్టీ సభ్యులు వెళ్ళిపోయారన్నారు. గత రెండేళ్ళుగా తన శాఖకు చెందిన అనుబంఽధ పద్దులపై సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు. అయితే శాసనసభ ముగింపు రోజున ప్రతిపక్ష నేత ఎడప్పాడి సభ నుంచి బయటకు వెళ్ళి, పొరపాటున తన కారెక్కేందుకు ప్రయత్నించారన్నారు. ఈ విషయంపై ఇపుడు ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎడప్పాడి ఆయన కారు తీసుకెళ్ళడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ఆ కారులో దారితప్పి బీజేపీ కార్యాలయానికి వెళ్ళకూడదన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.


nani2.2.jpg

వెంటనే మాజీ సీఎం ఈపీఎస్‌ కలుగజేసుకుని తమ కారు దారి తప్పదన్నారు. దీనికి డిప్యూటీ సీఎం ఉదయనిధి మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం ఈపీఎస్‌ అన్నాడీఎంకే నూతన కార్యాలయ నిర్మాణ పనులను చూసేందుకు ఢిల్లీ వెళ్ళినట్టుగా చెప్పారన్నారు. కానీ, ఎడప్పాడి అలా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే మూడు కార్లు మారిమారి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారని తెలిపారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. కానీ, గత పదేళ్ళ కాలంలో కేవలం ముగ్గురికు మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. ఎంకే స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం 104 మంది క్రీడాకారులకు ఉపాఽధి అవకాశం కల్పించిందన్నారు. గత నాలుగేళ్ళ కాలంలో 1821 మంది క్రీడాకారులకు రూ.60,014 కోట్ల విలువ చేసే ప్రోత్సాహకాలను అందజేశామన్నారు.


రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ హాకీ పోటీలు

చెన్నై, మదురైలో అంతర్జాతీయ హాకీ పోటీలను నిర్వహిస్తామని ఉదయనిధి తెలిపారు. ఈ పోటీల నిర్వహణ కోసం రూ.55 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఇందులో 24 దేశాలు పాల్గొంటాయని మొత్తం 72 పోటీలను నిర్వహిస్తామన్నారు. అలాగే, ముఖ్యమంత్రి క్రీడోత్సవాలను అన్ని విభాగాల్లో రూ.45 కోట్లతో నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నత సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శిక్షణ సమయంలో గాయపడుతుంటారని,


ఇలాంటి వారికి వైద్య ఖర్చుల కోసం ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించామన్నారు. తిరువళ్ళూర్‌, తిరువణ్ణామలై, తంజావూరు, దిండిగల్‌, కృష్ణగిరి జిల్లాల్లో పారా క్రీడా మైదానాలను నిర్మిస్తామన్నారు. వేళచ్చేరిలోనీ స్విమ్మింగ్‌పూల్‌ను రూ.18 కోట్లతో ఆధునికీకరిస్తామన్నారు. 40 అసెంబ్లీ స్థానాల్లో సీఎం స్పోర్ట్స్‌ మినీ మైదానాలను నిర్మిస్తామని వెల్లడించారు. చెన్నై నగరంలో ఈ యేడాది ఆఖరులో మళ్ళీ స్క్వాష్‌ అంతర్జాయ పోటీలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం ఉదయనిధి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2025 | 12:25 PM