Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:32 PM
బీజేపీ నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు సైతం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తుండటంతో రామ్‌లీలా మైదాన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5,000కు పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.

న్యూఢిల్లీ: ఇరవై ఏడేళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ పాలనకు శ్రీకారం చుడుతూ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి రామ్‌లీలా మైదాన్ ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం అతిషికి ఆహ్వానం పంపుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
BJP: ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత.. మధ్యాహ్నం ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం
కేజ్రీవాల్, అతిషితో పాటు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్‌ను స్వయంగా బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ ఆహ్వానించనున్నారు. దేశ రాజధానిలోని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, మురికివాడల ప్రజానీకాన్ని కూడా ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు.
5,000 మంది భద్రతా సిబ్బంది
బీజేపీ నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు సైతం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తుండటంతో రామ్‌లీలా మైదాన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5,000కు పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం 10 కంపెనీల పారామిలటరీ బలగాలను కూడా రంగంలోకి దింపుతున్నారు. యుద్ధప్రాతిపదికన రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నట్టు బీజేపీ ఎంపీ యేగేంద్ర చందోలియా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు పాల్గొంటున్న హైప్రొఫైల్ ఈవెంట్ కావడంతో తామెంతో ఉత్సుకతతో ఉన్నామని, మోదీని గెలిపించి బీజేపీకి పట్టంకట్టిని ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.