Viral Video: పెళ్లిలో గన్లు పట్టుకుని ఫోజులు ఇచ్చిన వధూవరులు.. మధ్యలో వధువుకు ఊహించని షాక్.. చివరకు..
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:56 PM
ఓ వివాహ కార్యక్రమంలో వధూరులుకు ఫోటోషూట్ చేస్తున్నారు. వేదికపై ఉన్న వధూరులకు నిప్పు రవ్వులు చిమ్మే స్పార్కిల్ గన్‌లను అందిస్తారు. కెమెరా ఆన్ చేయగానే వారిద్దరినీ గన్‌లను పేల్చమని చెబుతారు. అయితే ఈ క్రమంలో వధువుకు ఊహించని షాక్ తగులుతుంది..

వివాహాల సమయంలో కొన్నిసార్లు వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఫొటోఫూట్ చేసే సమయంలో వధూవరులు ఊహించని సమస్యలు ఎదురవడం చూస్తుంటాం. ఏదో చేయాలని చూస్తే చివరకు ఇంకేదో జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో వధూవరులు స్పార్కిల్ గన్‌లు పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూరులుకు ఫోటోషూట్ చేస్తున్నారు. వేదికపై ఉన్న వధూరులకు నిప్పు రవ్వులు చిమ్మే స్పార్కిల్ గన్‌లను అందిస్తారు. కెమెరా ఆన్ చేయగానే వారిద్దరినీ (bride and groom fired sparkler gun) గన్‌లను పేల్చమని చెబుతారు. అందుకు తగ్గట్టుగానే వధూవరులు ఇద్దరూ సిద్ధంగా ఉంటారు.
Viral Video: స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి లారీ కిందపడ్డాడు.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
కెమెరామెన్ వీడియో ఆన్ చేసి, వారికి సిగ్నల్ ఇవ్వగానే.. ఇద్దరూ తుపాకీలను గాల్లోకి పేలుస్తారు. వరుడి తుపాకీ నుంచి నిప్పు రవ్వలు చిమ్ముతూ బయటికి వస్తాయి. అయితే వధువు తుపాకీ ట్రిగ్గర్ నొక్కగానే వెలుగులు రావాల్సింది పోయి.. తుపాకీ వెనుక భాగం ఎగిరి వచ్చి ఆమె తలకు కొట్టుకుంటుంది. దీంతో ఆమె తలపై చేయి పెట్టుకుని కదలకుండా ఉండిపోతుంది. వధువుకు ఏమైందో అర్థం కాక.. వరుడు అలాగే చూస్తుండిపోతాడు.
ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోఫల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిచ్చి పిచ్చి ఫోజుల కోసం అనవసరంగా వధువును గాయపరిచారు కదరా’’.. అంటూ కొందరు, ‘‘హెల్మెట్ ధరించి ఉంటే సరిపోయేది కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 9.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇంట్లో ఎగురుతున్న హెలీకాప్టర్.. వీళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..