Elephant Attack: రోడ్డుపై నిలబడ్డ ఏనుగు.. పక్క నుంచి వెళ్లిపోవాలని చూసిన బైకర్.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Feb 06 , 2025 | 07:53 PM
ఓ పెద్ద ఏనుగు రోడ్డు మధ్యలో నిలబడి ఉండడంతో వాహనదారులంతా భయపంతో దూరంగా ఆగిపోయి ఉంటారు. అయితే ఇంతలో బైకుపై అటుగా వచ్చిన ఓ వ్యక్తి.. ఏనుగును చూసి కూడా ముందుకు కదిలాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

జనావాసాల్లోకి చొరబడే ఏనుగులు కొన్నిసార్లు బీభత్సం సృష్టించండం చూస్తుంటాం. ఈ క్రమంలో భారీ వృక్షాలు, ఇళ్లను సైతం పీకి పడేస్తుంటాయి. మరికొన్నిసార్లు రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపి మరీ ఆహార పదార్థాలను లాక్కుంటూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు రోడ్డు నిలబడి ఉండగా.. ఓ బైకర్ అటుగా దూసుకెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు (Tamil Nadu) కోయంబత్తూరు పరిధి వాల్పరై ప్రాంత సమీపంలోని టైగర్ వ్యాలీ వ్యూ పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు రోడ్డు మధ్యలో నిలబడి ఉండడంతో వాహనదారులంతా భయపంతో దూరంగా ఆగిపోయి ఉంటారు. అయితే ఇంతలో బైకుపై అటుగా వచ్చిన ఓ వ్యక్తి.. ఏనుగును చూసి కూడా ముందుకు కదిలాడు.
ఏనుగు పక్క నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించాడు. అయితే తీరా తగ్గరికి వెళ్లగానే ఏనుగు ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడింది. తొండంతో బైకును రోడ్డు పక్కకు విసిరేసింది. అంతటితో ఆగని ఏనుగు మళ్లీ అతడిపై దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. ఏనుగు రావడాన్ని చూసిన ఆ వ్యక్తి (elephant attacked biker) పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా ఏనుగు వదలకుండా అతన్ని వెంటపడి మరీ దాడి చేసింది. ఈ తర్వాత అక్కడే ఉన్న సూచికబోర్డులను కూడా విరిచి పడేసింది.
Train Viral Video: రైల్లో కిక్కిరిసిన జనం.. కిందపడకుండా ఇతనేం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని.. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి జర్మన్‌కు చెందిన 60 ఏళ్ల మైఖేల్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 4న చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఏనుగుల సమీపానికి వెళ్లడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఆన్‌లైన్ క్లాస్‌కు వచ్చి అవాక్కైన టీచర్.. మధ్యలో ఓ బాలిక ఏం చేసిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..