Share News

IRCTC Andaman Tour 2025: హైదరాబాద్​ టు అండమాన్.. సమ్మర్ కోసం IRCTC కొత్త ప్యాకేజీ..

ABN , Publish Date - Feb 28 , 2025 | 08:01 PM

IRCTC Andaman Tour 2025: ఏకాంతంగా మెత్తటి ఇసుక తిన్నెలపై ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరించాలనుందా.. అందుకోసం మనదేశంలోనే ఓ అద్భుతమైన ప్రాంతం ఉంది. అది, మరేదో కాదు. ఆహ్లాదకరమైన అండమాన్ నికోబార్ దీవులు. అంతదూరం ఎలా వెళ్లగలం. చాలా ఖర్చవుతుందే అని సంకోచించకండి. తక్కువ ఖర్చుతోనే అండమాన్ సందర్శించేందుకు IRCTC ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..

IRCTC Andaman Tour 2025: హైదరాబాద్​ టు అండమాన్.. సమ్మర్ కోసం IRCTC కొత్త ప్యాకేజీ..
Hyderabad to Andaman Tour Package by IRCTC

IRCTC Andaman Tour 2025: మన దేశంలో బీచ్‌లంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గోవా. ఆ తర్వాత వైజాగ్, చెన్నై ఇలా ఉన్నాయి. వీటన్నింటికంటే మోస్ట్ పాపులర్ బీచ్ మరొకటి కూడా ఉంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ అందమైన దీవులు ప్రశాంతతకు, ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వెళ్తే విదేశాలకు వెళ్లిన అనుభూతి తప్పక కలుగుతుంది. ఇన్నాళ్లూ మీకు చూడాలనే ఆశ ఉన్నా ఖర్చుకు భయపడి వెళ్లకపోయుంటే.. ఈసారి తప్పక చూసేయండి. బడ్జెట్‌లోనే IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తీసుకొచ్చిన ప్యాకేజీతో అండమాన్ నికొబార్ దీవుల అందాలను ఆస్వాదించండి. హైదరాబాద్ టు అండమాన్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు మీకోసం..


IRCTC అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ టూర్‌ ప్యాకేజీ వివరాలు..

5 రాత్రులు, 6 పగళ్ల వ్యవధి గల ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, నెయిల్​ ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, రాధానగర్ బీచ్ సహా పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.


ప్రయాణ ప్రణాళిక:

  • 1వ రోజు: ఉదయం 06.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కి ఉదయం 9 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అయ్యాక సెల్యులార్ జైలు మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్, లైట్ & రాత్రి సౌండ్ షో ఎంజాయ్ చేయవచ్చు.

  • 2వ రోజు: పోర్ట్ బ్లెయిర్ నుండి హావ్‌లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్.

  • 3వ రోజు: హేవ్‌లాక్ ద్వీపంలోని కాలాపత్తర్ బీచ్ సందర్శించవచ్చు. తర్వాత ప్రీమియం క్రూయిజ్ ద్వారా నెయిల్​ ఐలాండ్ చేరుకుంటారు. సాయంత్రం సీతాపూర్​ బీచ్‌లో గడిపి రాత్రికి నెయిల్​ ఐలాండ్‌లోనే బస చేయవచ్చు.

  • 4వ రోజు: భరత్‌ నగర్​ బీచ్‌లో స్విమ్మింగ్​, బోట్​ రైడ్​, వాటర్​ యాక్టివిటీస్​ ఎంజాయ్ చేయవచ్చు. తర్వాత క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు.

  • 5వ రోజు: రోస్​ ఐలాండ్, నార్త్​ బే ఐలాండ్, సాముద్రిక మెరైన్​ మ్యూజియం​ విజిట్​ చేస్తారు. రాత్రికి పోర్ట్​ బ్లెయిర్​లో బస.

  • 6వ రోజు: ఉదయం హోటల్ చెక్ అవుట్ చేసి 9 గంటలకల్లా పోర్ట్ బ్లెయిర్‌ ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.


ప్యాకేజీ ధర వివరాలు :

  • సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 68,320, డబుల్ ఆక్యుపెన్సీకి వ్యక్తికి రూ. 51,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.49,960.

  • 5-11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ రూ.42,950.

  • 2-11 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ రూ. 39,525.


ప్యాకేజీలో లభించే సదుపాయాలు:

1. హైదరాబాద్ నుండి పోర్ట్ బ్లెయిర్‌కు విమాన ప్రయాణ ఛార్జీలు

2.3 -స్టార్ హోటల్‌లో 5 రాత్రులు బస (పోర్ట్ బ్లెయిర్‌లో 2 రాత్రులు, హేవ్‌లాక్ ఐలాండ్‌లో 2 రాత్రులు, నీల్ ఐలాండ్‌లో 1 రాత్రి)

3. హోటల్‌లో అల్పాహారం, రాత్రి భోజనం.

4. AC వాహనంలో అన్ని సందర్శనా స్థలాలు ప్రయాణ ఖర్చులు.

5. అన్ని సందర్శనా స్థలాలకు ప్రవేశ రుసుములు, గైడ్ ఛార్జీలు.

6. పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపానికి ఫెర్రీ బదిలీలు.


ప్యాకేజీలో లేనివి:

భోజనం, స్నాక్స్, వాటర్ గేమ్స్, ఇతర వ్యక్తిగత ఖర్చులు లాండ్రీ, టిప్స్ ప్యాకేజీ ద్వారా లభించవు.

ఈ ప్యాకేజీ మార్చి 12వ తేదీన అందుబాటులో ఉంది. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.


Read Also : పట్టపగలే ఆసీస్‌కు చుక్కలు.. ఈ సిక్స్ చూశాక నిద్రపట్టడం కష్టమే

SpaDeX: మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం.. ఇస్రో ఛీఫ్ నారాయణన్..

రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా

Updated Date - Feb 28 , 2025 | 08:09 PM