Viral: రాత్రి వేళ ఆవుల షెడ్‌లోకి వెళ్లిన చిరుత.. అనుమానం వచ్చి ఉదయం సీసీ ఫుటేజీ చూడగా షాకింగ్ సీన్..
ABN , Publish Date - Feb 11 , 2025 | 03:13 PM
ఓ వ్యక్తి షెడ్ ఏర్పాటు చేసి ఆవులను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల వారి గోశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రోజూ ఆవుల షెడ్‌లోకి ఏదో జంతువు వచ్చి వెళ్తున్నట్లు యజమానికి సందేహం వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..

పులులు, సింహాలు అంటేనే మనుషులు, జంతువులు అనే తేడా లేకుండా విచక్షణా రహితంగా దాడి చేయడమే గుర్తుకొస్తుంది. దీంతో అవి కనిపించాయంటే చాలు ఒళ్లంతా గజాగజా వణికిపోతుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి క్రూర జంతువులు కూడా సాధు జంతువుల్లా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు వేటాడాల్సిన జంతువులతో ఏకంగా స్నేహమే చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటలనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ ఓ చిరుతపులి ఆవుల షెడ్‌లోకి వెళ్లింది. ఓ రోజు యజమానికి డౌట్ వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ ఘటనకు సంబంధించిన ఫొటో (Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లో (Gujarat) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి షెడ్ ఏర్పాటు చేసి ఆవులను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల వారి గోశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రోజూ ఆవుల షెడ్‌లోకి ఏదో జంతువు వచ్చి వెళ్తున్నట్లు యజమానికి సందేహం వచ్చింది. దీంతో ఓ రోజు ఉదయం గోశాల వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను పరిశీలించాడు.
Viral Video: తప్పు చేసింది ఒకరైతే.. బలైంది మరొకరు.. ట్రాఫిక్‌లో ఈ బైకర్ నిర్వాకం చూస్తే..
సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. ఓ చిరుత పులి రోజూ రాత్రి గోశాలలోకి వచ్చి ఆవు పక్కనే (leopard lying next to cow) పడుకుంటున్నట్లు గమనించాడు. చిరుత పులి ఆవు పక్కన పడుకోవడం ఏంటీ అని అంతా షాక్ అయ్యారు. అయితే అసలు కథ తెలుసుకుని చివరకు భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని నెలల కిందట పిల్లకు జన్మనిచ్చిన చిరుత పులి చంపబడింది. ఆ సమయంలో చిరుత పులి పిల్లకు 20 రోజుల వయస్సు ఉండేది. అప్పట్లో ఆవు ఆ చిరుత పులికి పిల్లకు పాలు ఇచ్చింది. దీంతో పిల్ల చిరుత ఆవును తన తల్లిగా భావించింది.
Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
రోజూ చిరుత పులి ఆ ఆవు వద్దకు వచ్చి పాలు తాగుతూ ఉండేది. ఇలా ఆ రెండింటి మధ్య తల్లీ, పిల్లల బంధం ఏర్పడింది. ఆవు కూడా ఆ చిరుతను పక్కనే పడుకోబెట్టుకుంటూ ఉంది. ఇలా చిరుత పులి, ఆవు.. తల్లీపిల్లల్లా కలిసిపోవడాన్ని అంతా ఆసక్తిగా చర్చించుంటున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆవు ప్రేమ కన్నతల్లిని మరిపించేలా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ రెండింటినీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..