Viral Video: ఈ కారును ఫాలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..
ABN , Publish Date - Feb 09 , 2025 | 09:48 PM
ఓ వ్యక్తి తన కారును వెనుక వైపు ఎవరూ ఢీకొట్టకుండా ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. కారు వెనుక ఎలాంటి కొటేషన్లు రాయకుండా.. ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు..

వాహన యజమానులు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అనేక ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కొందరు తమ ఎంతో జాగ్రత్తగా వాహనాలు నడిపితే.. మరికొందరు తమ వాహనాల వెనుక వైపు సమీపానికి రాకుండా అనేక సందేశాలను రాస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్రమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కారు వెనుక వైపు ఎవరూ ఢీకొట్టకుండా వినూత్న జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారును వెనుక వైపు ఎవరూ ఢీకొట్టకుండా ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. కారు వెనుక ఎలాంటి కొటేషన్లు రాయకుండా.. ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు.
Viral Video: తప్పు చేసింది ఒకరైతే.. బలైంది మరొకరు.. ట్రాఫిక్‌లో ఈ బైకర్ నిర్వాకం చూస్తే..
ఓ వృద్ధుడు బొమ్మను తీసుకొచ్చి కారు వెనుక (Old Man Statue Behind Car) అద్దం దగ్గర పెట్టాడు. ఇది చూసేందుకు దయ్యంలా కనిపిస్తుండడంతో చూసేవారికి భయం కలిగించేలా ఉంది. కారుకు సమీపంగా వచ్చిన వారు లైటింగ్ వెలుతురులో ఆ బొమ్మను చూసి భయంతో ఆగిపోతున్నారు. ఇంకొందరు దాని వైపే చూస్తూ అలాగే ఉండిపోతున్నారు. ఇలా తన కారు సమీపానికి ఎవరూ రాకుండా ఇతను వినూత్న ట్రిక్ వాడాడు.
Metro Viral Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న వ్యక్తి.. సడన్‌గా మీద పడిపోయిన యువతి.. చివరకు..
ఈ కారును చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో్.. ఈ కారును చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కారు డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..