Share News

Viral Video: పరాయి వ్యక్తితో కారులో వెళ్తున్న భార్య.. బైకుపై వెనుకే వెళ్లిన భర్త.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

ABN , Publish Date - Jan 17 , 2025 | 06:25 PM

ఓ వ్యక్తి బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యలో అతడికి షాకింగ్ సీన్ కనిపించింది. తన భార్య పరాయి వ్యక్తితో కలిసి కారులో వెళ్లడాన్ని చూసి షాక్ అయ్యాడు. దీంతో భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని బైకుతో వెంబడించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: పరాయి వ్యక్తితో కారులో వెళ్తున్న భార్య.. బైకుపై వెనుకే వెళ్లిన భర్త.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. భర్త పరాయి మహిళతో ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం చూస్తుంటాం. అలాగే భార్య తన ప్రియుడితో ఉండగా భర్త కాపుకాచి మరీ పోలీసులకు పట్టిస్తుంటాడు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన భార్య వేరే యువకుడితో కారులో వెళ్లడాన్ని చూసి వెంబడించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మొరాదాబాద్‌ పరిధి కట్ఘర్ కొత్వాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సమీర్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యలో అతడికి షాకింగ్ సీన్ కనిపించింది. తన భార్య మహీర్ అనే వ్యక్తితో కలిసి కారులో వెళ్లడాన్ని చూసి షాక్ అయ్యాడు. దీంతో సమీర్‌కు కోపం కట్టలుతెంచుకుంది. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని బైకుతో వెంబడించాడు. సమీర్ తనను వెంబడించడాన్ని గమనించిన మహీర్.. కారు వేగాన్ని పెంచాడు.

Viral Video: చెట్టులో ఇరుక్కున్న గాలిపటం కోసం.. ఇతను చేసిన పనికి అవాక్కైన వాహనదారులు.. చివరకు..


అయినా సమీర్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో కారు బలంగా తాకండంతో సమీర్.. బైకుపై నుంచి (Man on car bonnet) ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అద్దంపై ఉన్న వైపర్‌ను పట్టుకుని అలాగే పడుకుండిపోయాడు. కారు బానెట్‌పై వ్యక్తిని లాక్కెళ్లడం చూసి చుట్టు పక్కల వాహనదారులు షాక్ అయ్యారు. కారు ఆపమని గట్టిగా కేకలు వేశారు. కానీ మహీర్ మాత్రం వాహనాన్ని ఆపకుండా మరింత వేగంగా వెళ్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారులు.. వెంబడించి మరీ కారును ఆపేశారు.

Viral Video: రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటకూడదనేది ఇందుకే.. ఇతడికేమైందో మీరే చూడండి..


కారు ఆపిన తర్వాత బానైట్ పైనుంచి కిందకు దిగిన సమీర్.. మహీర్‌ను కిందకు దించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరకుని మహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇది మరీ దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అరే..! ఇదేం మాయ.. ఇవి నీళ్లా లేక నిప్పు రవ్వలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 17 , 2025 | 07:17 PM

News Hub