Share News

Viral Video: రోటీలు తినేముందు ఇది గమనిస్తున్నారా.. ఇతనెలా చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 09:28 AM

కొన్ని హోటళ్లలో ఆహారం చేసే విధానం చూస్తే బయట తిండిపైనే విరక్తి వచ్చేలా ఉంటుంది. మరికొందరైతే వంట తయారీ విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. కొందరు శుభ్రత పాటించకుండా వంట చేస్తుంటే.. మరికొందరు కావాలనే అందులో ఉమ్మివేయడం, మూత్రం పోయడం వంటి దారుణమైన పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: రోటీలు తినేముందు ఇది గమనిస్తున్నారా.. ఇతనెలా చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..

కొన్ని హోటళ్లలో ఆహారం చేసే విధానం చూస్తే బయట తిండిపైనే విరక్తి వచ్చేలా ఉంటుంది. మరికొందరైతే వంట తయారీ విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. కొందరు శుభ్రత పాటించకుండా వంట చేస్తుంటే.. మరికొందరు కావాలనే అందులో ఉమ్మివేయడం, మూత్రం పోయడం వంటి దారుణమైన పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసి శిక్షిస్తున్నా కూడా ఇంకా చాలా మందిలో మార్పు రావడం లేదు. వంట చేయడంలో ఇప్పటికీ చాలా మంది అధ్వానంగా వ్యవహరించడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోటీలు ఎలా చేస్తున్నాడో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఆషకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వంట చేస్తున్న ఓ వ్యక్తి రోటీలు (Rotis) చేయడం స్టార్ట్ చేశాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అతడు రోటీలు చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..


పిండిని గుండ్రంగా రోల్ చేసిన ఆ వ్యక్తి (man spat on the roti dough) తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని, అందులో ఉమ్మి వేసిన తర్వాత పాన్‌పై వేడి చేస్తున్నాడు. మొదట ఇతడి వ్యవహారాన్ని ఎవరూ గమనించలేదు. అయితే అక్కడే ఉన్న ఓ కస్టమర్ తర్వాత ఇతడు చేస్తున్న దారుణాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సమచారం అందుకున్న పోలీసులు.. సదురు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Viral Video: భయపెట్టాలని చూశారు.. చివరకు అవాక్కయ్యారు.. పడుకున్న కుక్క పక్కన టపాసు పేల్చడంతో..


విచారణలో అతను జ్నోర్ జిల్లా ధాంపూర్‌లోని నాయ్ బస్తీ కి చెందిన ఇర్ఫాన్ అని తెలిసింది. కాగా, ఈ ఘటనలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటివి చూసినప్పుడు.. బయటి ఫుడ్ తినాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: మిఠాయిలు నమిలిన యువతికి దవడ నొప్పి.. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 12 , 2025 | 09:28 AM