Share News

Viral Video: ఇతడి తెలివి తెల్లారిపోనూ.. వంటలో ఉప్పు తక్కువైందని ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Feb 05 , 2025 | 07:29 PM

ఓ వ్యక్తి వంట చేసే సమయంలో చివరగా దాని రుచి ఎలా (man tasted food) ఉందో చూసేందుకు టేస్ట్ చేశాడు. అయితే అందులో ఉప్పు తక్కువగా ఉందని గుర్తించాడు. దీంతో ఉప్పు తీసుకుని అందులో కలిపాడు. ఆ తర్వాత గరిటలోని ఆహారాన్ని రుచి చూస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఇతడి తెలివి తెల్లారిపోనూ.. వంటలో ఉప్పు తక్కువైందని ఏం చేస్తున్నాడో చూడండి..

వంట చేసే సమయంలో కొందరి ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంటుంది. కొందరు చేతులను అటూ, ఇటూ తిప్పుతూ వేగంగా వంట చేయడమే కాకుండా అందులో వేయాల్సిన దినుసులను కూడా అంతే వేగంగా వేసేస్తుంటారు. అయినా వంట రుచి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంటారు. ఇంకొందరు వంట చేసే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. బైకుపై కూర్చుని వరుసగా వంట పాత్రల్లో మసాలా కలపడం చూశాం. మరికొందరు ఫోన్ చూస్తూ వంట చేస్తూ చివరకు అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వంటలో ఉప్పు కలపే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసే సమయంలో చివరగా దాని రుచి ఎలా (man tasted food) ఉందో చూసేందుకు టేస్ట్ చేశాడు. అయితే అందులో ఉప్పు తక్కువగా ఉందని గుర్తించాడు. దీంతో ఉప్పు తీసుకుని అందులో కలిపాడు. ఆ తర్వాత గరిటలోని ఆహారాన్ని రుచి చూస్తాడు.

Viral Video: విద్యుత్ అవసరమే లేని ఫ్రిడ్జ్‌.. ఇంట్లోనే సులభంగా ఎలా సెట్ చేశారో చూడండి..


అప్పటికీ సరిపోకపోవడంతో మళ్లీ ఉప్పు కలుపుతాడు. ఆ తర్వాత టేస్ట్ చూడగా ఉప్పు ఇంకా తక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మళ్లీ ఇంకోసారి (adds salt to food) ఉప్పును కలుపుతాడు. ఇలా గరిటను పాత్రలో పెట్టకుండా.. అదే ఆహారాన్ని పదే పదే రుచి చూస్తూ.. పదే పదే ఉప్పు కలుపుతూ చివరకు ఆహారాన్ని మొత్తం నాశనం చేస్తాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: బోల్తా పడిన కారు.. దెబ్బలు తగిలినా లెక్కచేయకుండా.. ఈ చిన్నారి చేస్తున్న నిర్వాకం చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా వంట చేయడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి తెలివితెల్లారిపోనూ.. ఇలాక్కూడా ఉప్పు కలుపుతారా’’.. అంటూ మరికొందరు, ‘‘చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2025 | 07:29 PM