Share News

Doctor Viral Video: వైద్యం పేరుతో తల్లిదండ్రుల సమక్షంలోనే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:15 PM

తల్లిదండ్రులు తమ కుమార్తెను తీసుకుని నాటు వైద్యుడి వద్దకు వచ్చారు. కడుపులో మంటగా ఉందని ఆమె సదరు డాక్టర్‌కు చెబుతుంది. సమస్యను విన్న వైద్యుడు.. బాలిక కడుపు, ఛాతీపై చేతులు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇతడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Doctor Viral Video: వైద్యం పేరుతో తల్లిదండ్రుల సమక్షంలోనే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..

‘‘వైద్యో.. నారాయణో హరి’’.. వైద్యుడు దేవుడితో సమానమని దీని అర్థం. ఈ నానుడికి తగ్గట్టుగానే ఎంతో మంది వైద్యులు రోగుల ప్రాణాలు కాపాడి, వారి పాలిట దేవుడిలా మారుతుంటారు. అయితే కొందరు మాత్రం వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. ఆదాయమే పరమాధిగా కొందరు పని చేస్తుంటే.. మరికొందరు ఆడవారి పట్ల అసభ్యకరంతగా ప్రవర్తిస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. ఇలాంటి వైద్యుడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నాటు వైద్యుడు వైద్యం పేరుతో తల్లిదండ్రుల సమక్షంలోనే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు తమ కుమార్తెను తీసుకుని ఓ నాటు వైద్యుడి వద్దకు వచ్చారు. కడుపులో మంటగా ఉందని ఆమె సదరు డాక్టర్‌కు చెబుతుంది. సమస్యను విన్న వైద్యుడు.. బాలిక కడుపు, ఛాతీపై చేతులు పెడుతూ (doctor misbehaved with the girl) అసభ్యకరంగా ప్రవర్తించాడు. నొప్పి ఎక్కడ ఉంది.. అని అడుగుతూ పదే పదే ఆమెను ఎక్కడపడితే అక్కడ తాకుతూ ఉంటాడు.

Viral Video: పని చేస్తున్నారా.. ప్రాణాలు తీసుకుంటున్నారా.. వీడియో చూస్తే గండె గుబేల్‌మనడం ఖాయం..


వైద్యుడు పదే పదే తాకుతుండడంతో ఆ బాలిక తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉంటుంది. అయినా బయటికి చెప్పకుండా వైద్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. బాలిక పక్కనే తల్లిదండ్రులు ఉన్నా కూడా వైద్యుడు.. ఏమాత్రం లెక్కచేయకుండా పరీక్షిస్తున్నట్లు నటిస్తూ తాకుతూ ఉంటాడు. తనకు ఊపిరి ఆడటంలో ఇబ్బందిగా ఉందని పదే పదే చెబుతున్నా.. వైద్యుడు ఏవేవో చెబుతూ తాకుతూ ఉంటాడు.

Viral Video: దొంగ ఇంట్లోకి వస్తే తెలిసేలా.. ఇతను వాడిన ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..


ఇలా వైద్యం పేరుతో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులకు అర్థం కాకపోవడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వైద్యుల వల్ల వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2025 | 04:26 PM

News Hub