Tiger Viral Video: రీల్స్ చూస్తున్న యువకుడు.. మంచం వద్దకు వచ్చిన పులి.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 07:50 PM
ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటి బయట మంచంపై పడుకుని ఫోన్‌లో రీల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పులి మంచం వద్దకు రావడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఒకప్పుడు ప్రపంచంతో మమేకమైన మనిషి.. ప్రస్తుతం స్మార్ట్ ఫోనే ప్రపంచంగా బతుకుతున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోనంతగా ఫోన్‌లో మునిగిపోతున్నాడు. పక్కనే ప్రమాదం పొంచి ఉన్నా కూడా చూసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పడుకుని రీల్స్ చూస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద పులి మంచం వద్దకు వచ్చింది. చివరకు జరిగింది చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటి బయట మంచంపై పడుకుని ఫోన్‌లో రీల్స్ (Man watching reels on phone) చూసుకుంటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద పులి అటుగా వచ్చింది. మంచం కింద పడుకున్న కుక్కను చూసి మెల్లిగా సమీపానికి వచ్చింది.
పులి మంచం వద్దకు వచ్చినా కూడా (Tiger came to the bed) ఆ యువకుడు ఏమీ గమనించకుండా ఫోన్‌లో మునిగిపోయాడు. మంచం వద్దకు వచ్చిన పులి..పడుకున్న కుక్కను నోటకరుచుకుని అక్కడి నుంచి పారిపోయింది. శబ్ధం రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచని ఆ వ్యక్తి.. భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇంతలో ఆ కుక్క కూడా పులి నుంచి తప్పించుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇలా పులి దాడి నుంచి అతడితో పాటూ ఆ కుక్క కూడా తప్పించుకుందన్నమాట.
Woman Funny Video: గేదెను కూడా వదల్లేదుగా.. వ్యూస్ కోసం ఈమె చేస్తున్న పని చూడండి..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్‌లో పిచ్చిలో పడితే పులి వచ్చినా డోంట్ కేర్’’.. అంటూ కొందరు, ‘‘కుక్కను వదిలి పారిపోవడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 1. 5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..