Share News

Viral: స్నేహితులతో కలిసి ‘చోలీ కే.. పీచే హ్యాహై’.. అంటూ డాన్స్ వేశాడు.. చివరకు వధువు చేసిన పనికి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 01:38 PM

ఓ వివాహ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వరుడు తన పెళ్లిలో స్నేహితులతో కలిసి ‘‘చోలీకే పీచే క్యా హై’’.. పాటకు సంతోషంగా డాన్స్ చేశాడు. అయితే చివరకు వధువు తీసుకున్న నిర్ణయంతో చివరకు షాక్ అయ్యాడు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral: స్నేహితులతో కలిసి ‘చోలీ కే.. పీచే హ్యాహై’.. అంటూ డాన్స్ వేశాడు.. చివరకు వధువు చేసిన పనికి ఖంగుతిన్నాడు..

ప్రస్తుత రోజుల్లో జరిగే వివాహ వేడుకల్లో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు వధూవరులు ప్లాన్ చేసుకుని మరీ ప్రాంక్‌లు చేస్తే.. మరికొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు చిన్న సమస్యలతో చివరకు పెళ్లిళ్లనే రద్దు చేసుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వరుడు తన స్నేహితులతో కలిసి.. ‘చోలీ కే.. పీచే హ్యాహై’ అనే పాటకు డాన్స్ చేశాడు. చివరకు వధువు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన న్యూఢిల్లీలో (New Delhi) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి.. ఇదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం (Marriage) నిశ్చయమైంది. పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు తమ బంధువులతో కలిసి కళ్యాణ మంటపం వద్దకు చేరుకున్నారు. వరుడు తన స్నేహితులతో కలిసి ఊరేగింపుగా మంటపం వద్దకు వచ్చాడు.

Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..


అయితే ఈ సందర్భంగా స్నేహితులంతా కలిసి తమతో పాటూ డాన్స్ చేయాలని వరుడిని బలవంతం చేశారు. దీంతో కాదనలేక అతను ‘‘చోలీకే పీచే క్యా హై’’.. అనే హిందీ పాటకు (groom danced) స్టెప్పులు వేశాడు. అతడి డాన్స్ చూసి అంతా ఈలలు, కేకలతో మారుమోగించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరుడు అసభ్యకరంగా డాన్స్ చేయడం (bride called off the wedding) వధువుకు అస్సలు నచ్చలేదు. దీంతో చివరకు ‘‘ఇలాంటి వ్యక్తితో నాకు పెళ్లే వద్దు’’.. అంటూ భీష్మించుకుంది.

Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..


ఆమె నిర్ణయంతో షాక్ అయిన వరుడు.. ‘‘అదేదో సరదాగా డాన్స్ చేశా.. దీనికే పెళ్లి కేన్సిల్ చేయడం ఏంటీ’’.. అంటూ వారితో అన్నాడు. చివరకు బంధువులంతా నచ్చజెప్పినా వధువు వినిపించుకోలేదు. చివరకు చేసేదేమీలేక ఇరు కుటుంబాల వారు పెళ్లి రద్దు చేసుకుని, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంత చిన్న దానికే పెళ్లి రద్దు చేసుకోవడం ఏంటీ’’.. అంటూ కొందరు, ‘‘వరుడి కొంపముంచిన డాన్స్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: దర్జాగా పర్సు కొట్టి మరీ.. చివరకు ఎలా తప్పించుకున్నాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 01:46 PM