Share News

Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..

ABN , Publish Date - Feb 02 , 2025 | 12:25 PM

కొందరు తాము చేసేది తప్పని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుంటారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. తాజాగా ఓ భార్య ఇలాగే చేసింది. కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది. చివరకు ఓ రోజు రాత్రి ఆమె చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..

Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..
ప్రతీకాత్మక చిత్రం

సవ్యంగా సాగే సంసారాలు.. దంపతుల్లో ఎవరో ఒకరో చేసే తప్పుల కారణంగా చివరకు చిన్నాభిన్నమవుతున్నాయి. తద్వారా వారి పిల్లలు అనాథలవుతుంటారు. కొందరు తాము చేసేది తప్పని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుంటారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలోనే ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించింది. అయితే చివరకు ఆమె చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral News) అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) హౌరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో సుబ్బయ్య, నిర్మల (పేర్చు మార్చాం) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 సంవత్సరాల కూతురు ఉంది. సుబ్బయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే కూతురు పెద్దదయ్యే కొద్దీ చదువు కోసం మరింత ఖర్చు చేయాల్సి వచ్చింది. వారి ఆర్థిక స్థోమత అంతంతే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు.

Viral Video: దర్జాగా పర్సు కొట్టి మరీ.. చివరకు ఎలా తప్పించుకున్నాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఈ క్రమంలో నిర్మలకు ఓ ఆలోచన వచ్చింది. భర్త కిడ్నీని విక్రయించి, తద్వారా వచ్చిన డబ్బులతో కూతురును బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన భర్తతో చెప్పింది. అయితే ఇందుకు అతను నిరాకరించాడు. కిడ్నీ లేకపోతే తాను పని చేయలేనని, ఎలాగోలా కొన్నాళ్లు కష్టపడితే సమస్యలన్నీ తొలగిపోతాయని భార్యకు నచ్చజెప్పాడు. అయినా భార్య మాత్రం పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భర్తను బలవంతం చేసేది. ఒక కిడ్నీ ఉన్నా కూడా పనులు చేయవచ్చని, డబ్బులు వస్తే కూతురు బాగా చదువుకుంటుందని.. రోజూ చెబుతుండడంతో చివరకు భర్త అంగీకరించాడు.

Elephant Viral Video: ఏనుగు లవ్ ప్రపోజ్ ఎప్పుడైనా చూశారా.. పూలు పట్టుకుని ఏం చేసిందో చూడండి..


భర్త అంగీకరించడంతో కిడ్నీని కొనేవాళ్ల కోసం ఆమె నెల రోజుల పాటు విచారించింది. చివరకు పార్టీని సంప్రదించి రూ.10 లక్షలకు (wife sold her husband's kidney) విక్రయించేలా మాట్లాడుకుంది. ఇద్దరూ ఆ డబ్బులను ఇంటికి తీసుకొచ్చారు. డబ్బులను తాను భద్రంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తానని చెప్పడంతో భార్య చేతికి ఇచ్చాడు. అయితే ఆమె రాత్రి సడన్‌గా అదృశ్యమైంది. తెలిసిన వారి వద్ద విచారించినా ఆమె మాత్రం కనిపించలేదు.

Viral Video: మరీ ఇంత సిన్సియర్ వాకింగ్ ఏంట్రా బాబోయ్.. రైలు పట్టాలు దాటుతూ కూడా ఈమె నిర్వాకం చూడండి..


ఈ క్రమంలో శుక్రవారం బరాక్‌పూర్‌ ప్రాంతంలో రవిదాస్ అనే పెయింటర్‌తో కలిసి ఉంటోందని తెలిసింది. కుటుంబ సభ్యులతో కలిసి భర్త అక్కడికి చేరుకోవడంతో ఆమె తలుపులు మూసేసింది. తనకు ఎవరూ అవసరం లేదని, త్వరలో విడాకలు పేపర్లు పంపిస్తానని సమాధానం ఇచ్చింది. దీంతో చివరకు భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: మైట్రో రైల్లో డోరు వద్ద నిల్చున్న అమ్మాయి.. వెనుకే గమనిస్తున్న యువకుడు.. స్టేషన్ రాగానే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 12:28 PM